BSNL: 395 రోజులు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిశ్చింతగా ఉండేలా చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL అఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్

డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను యూజర్లు పొందుతారు

BSNL: 395 రోజులు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!

ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిశ్చింతగా ఉండేలా చేసే బెస్ట్ ప్రీపెయిడ్ బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అఫర్ చేస్తోంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ తో పూర్తిగా 395 రోజులు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. మనం మాట్లాడుకుంటోంది బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.2399 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించే. ఈ ప్లాన్ అందిస్తున్న పూర్తి ప్రయోజనాల గురించి వివరంగా చూద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Rs.2,399 Plan

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మీకు అందుతుంది. అలాగే, ఈరోజుకు 2GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు మరియు ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని వినియోగించుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ రీఛార్జ్ తో డైలీ 100 SMS లను కూడా ఉపయోగించుకోవచ్చు, అదీకూడా పూర్తి వ్యాలిడిటీ కాలం.

ఇక ఈ ప్లాన్ తో జతగా లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 30 రోజుల ఉచిత PRBT, 30 రోజుల EROS Now ఉచిత యాక్సెస్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ తీసుకువస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo