bsnl limited festive offer giving users free internet and calling for 30 days offer valid till this date
BSNL యూజర్లకు సంవత్సరం మొత్తంగా అన్లిమిటెడ్ ప్రయోజనాలు బడ్జెట్ ధరలో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను యూజర్ల కోసం అందించింది. ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటాతో పాటు మరిన్ని లాభాలు అందిస్తుంది. బడ్జెట్ ధరలో వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారు పరిశీలించి తగిన ఈ బడ్జెట్ ప్లాన్ గురించి ఈరోజు వివరంగా చూద్దాం.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) యూజర్ల కోసం అందించిన బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఈ క్రింద చూడవచ్చు.
బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ సంవత్సరం కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు దేశం మొత్తం అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 395 రోజులు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేట్ అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుతుంది. ఈ వన్ ఇయర్ ప్లాన్ తో Hardy గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రో టెల్, గేమియం, Lystn Podocast, Zing మ్యూజిక్ మరియు 365 రోజులు BSNL Tunes వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
Also Read: TRAI: టెలికాం కంపెనీ వెబ్సైట్ లో కవరేజ్ మ్యాప్ అందించాలని ఆదేశించిన ట్రాయ్.!
బడ్జెట్ ధరలో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే వారికి ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ తగిన ఆప్షన్ అవుతుంది.
మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here