BSNL: కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అందించిన ప్రభుత్వ టెలికం.!

HIGHLIGHTS

యూజర్ల కోసం కొత్త ప్లాన్ అందించిన బిఎస్ఎన్ఎల్

ఈ ప్లాన్ ను రూ. 269 రూపాయల ధరతో అందించింది

ఈ ప్లాన్ OTT బెనిఫిట్స్ తో పాటు మరిన్ని లాభాలనిస్తుంది

BSNL: కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అందించిన ప్రభుత్వ టెలికం.!

ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యూజర్ల కోసం గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా కొత్త ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ ను రూ. 269 రూపాయల ధరతో అందించింది మరియు  దీన్ని Gaming STV 269 పేరుతో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటులో వస్తుంది మరియు ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ హెవీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు OTT బెనిఫిట్స్ తో పాటుగా గేమింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ఆఫర్ల చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Gaming STV 269:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క STV 269 ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్  20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.  ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో డైలీ 2GB డైలీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత డేటా స్పీడ్ 40Kbps కి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 ఉచిత SMS లను కూడా పొందుతారు. 

ఇక ఈ ప్లాన్ తో లభించే ఇతర ప్రయోజనాల గురించి చూస్తే, ఈ ప్లాన్ తో EROSnow కోసం ఉచిత యాక్సెస్ అందుతుంది. దీనితో పాటుగా హార్డీ మొబైల్ గేమ్స్, ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్,గేమ్ ఆన్ సర్వీస్ మరియు GAMEIUM ప్రీమియం గేమింగ్ అప్లికేషన్ కోసం యాక్సెస్ ను అందకుంటారు. అంతేకాదు, Lystn మ్యూజిక్ సర్వీస్, Lokdhun మరియు Zing సర్వీస్ లను కూడా ఈ ప్లాన్  యూజర్లకు అఫర్ చేస్తోంది. అలాగే, ఈ ప్లాన్ BSNL Tunes కి కూడా యాక్సెస్ లభిస్తుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo