BSNL: యూజర్ల కోసం అద్భుతమైన ఉచిత అఫర్ ని అనౌన్స్ చేసిన ప్రభుత్వ టెలికం.!
BSNL తన యూజర్ల కోసం ఈ అద్భుతమైన ఉచిత అఫర్ ని అనౌన్స్ చేసింది
BSNL యూజర్లు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవచ్చు
భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్ లో భాగంగా ఈ అఫర్ ను లాంచ్ చేసింది
ప్రభుత్వ టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఈ అద్భుతమైన ఉచిత అఫర్ ని అనౌన్స్ చేసింది. అతి తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ లను అఫర్ చేస్తున్న BSNL ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ను 100 Mbps కు ఉచితంగా పెంచుకునే అద్భుతమైన అఫర్ ను కూడా అందించింది. BSNL యూజర్లకు అందించిన ఈ కొత్త ఉచిత ఆఫర్ మరియు దాని వివరాలు తెలుసుకోండి.
Survey2023 స్వాతంత్ర దినోత్సవ మరియు 75 సంవత్సరాల అమృత్ మత్సవ్ లో భాగంగా ఈ కొత్త ఉచిత అప్గ్రేడ్ అఫర్ ను BSNL తన యూజర్ల కోసం అందించింది. భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్ లో భాగంగా ఈ అఫర్ ను లాంచ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ అఫర్ ద్వారా నిర్ణిత కాలానికి గాను ఇంటర్నెట్ స్పీడ్ ను 100 Mbps కు పెంచుకోవచ్చు.
అంటే, ఎటువంటి అధనపు రుసుమును లేదా చార్జీలు చెల్లించే పని లేకుండానే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వారి బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ను 100 Mbps వేగంతో పొందవచ్చు. అయితే, ఈ ఉచిత స్పీడ్ ఇంటర్నెట్ కేవలం 10 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఒక 10 రోజులు మీ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా 100 Mbps కు పెంచుకొని ఆనందించవచ్చు.
ఈ అవకాశం సద్వినియోగం చేయదలచుకున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) FTTH బ్రాండ్ బ్యాండ్ యూజర్లు my BSNL App ద్వారా వారి FTTH (ఫైబర్ టు ది హోమ్) కనెక్షన్ నంబర్ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు.
ఎవరు ఈ ఉచిత అప్గ్రేడ్ ను పొందవచ్చు?
BSNL యొక్క FTTH బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన ప్రతీ కస్టమర్ ఈ 10 రోజుల ఉచిత స్పీడ్ ఇంటర్నెట్ ను అందుకోవచ్చు. దీనికోసం ఎటువంటి అదనపు ఛార్జ్ లు చెల్లించ వలసిన పనికూడా లేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile