BSNL 5G expected launch date announced
BSNL 5G: దేశంలో శరవేగంగా 4G నెట్వర్క్ ను విస్తరిస్తున్న ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ అందించింది. గొప్ప ఆఫర్స్ మరియు చవక ధరలో ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్, నెట్ వర్క్ మరియు ఇంటర్నెట్ స్పీడ్ పరంగా కొంత నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే, కొత్తగా అవలంభిస్తున్న పద్దతులతో ఇప్పటికే 4G నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కానీ, ఇప్పుడు కేంద్ర టెలికాం మినిస్టర్ కొత్త ప్రకటనతో బిఎస్ఎన్ఎల్ 5G డేట్ గురించి కొత్త విషయం బయటకు వచ్చింది.
సోమవారం నాడు జరిగిన US – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ లో కేంద్ర టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, ఈ కొత్త ప్రకటన చేశారు. ఈ సమయం నుంచి ఆయన మాట్లాడుతూ, “4G కోసం ప్రపంచాన్ని అనుసరించింది, 5G కోసం కలిసి ప్రయాణించింది, కానీ 6G టెక్నాలజీ కోసం ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుంది, అని చెప్పారు.
స్ సమావేశం నుంచి బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే చేసిన 4G నెట్ వర్క్ విస్తరణ మరియు శరవేగంగా విస్తరిస్తున్న 4G నెట్ వర్క్ విస్తరణ ను కూడా కొనియాడారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ – మే నాటికి 1,00,000 సైట్ లలో 4G నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది మాత్రమే, కాదు ఇప్పటికే 38,300 సైట్స్ లో బిఎస్ఎన్ఎల్ 4G పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కూడా వెల్లడించారు.
డిఇ సమావేశం నుంచి బిఎస్ఎన్ఎల్ 5G ఎప్పుడు రావచ్చు అనే విషయం పైన కూడా ఒక ప్రకటన చేశారు. 2025 ఏప్రిల్ నుంచి మే నెలలో అందుబాటులోకి వచ్చే 4G నెట్ వర్క్ లను 2025 జూన్ నాటికి 5G నెట్ వర్క్ కు స్విచ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Jio Bharat V3 and V4: చవక ధరలో రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్లు లాంచ్ చేసిన జియో.!
ప్రపంచ దేశాలతో పోలిస్తే, 5G త్వరగా అందుకున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి.దేశంలో ఇప్పటికే 4,50,000 పైకి పైగా 5G టవర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందంతా కూడా కేవలం 2 సంవత్సరాల కంటే తక్కువ కాలంలోనే సాధించబడింది. అయితే, ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ 5G సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రకటన బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఊరటనిస్తుంది.