BSNL 4G: కేవలం రూ. 200 ఖర్చుతో నెల మొత్తం డేటా మరియు కాలింగ్ అందుకోండి.!

Updated on 13-Oct-2025
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది

కేవలం రూ. 200 ఖర్చుతో 30 రోజులు డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోవచ్చు

దేశం మొత్తం 4G నెట్ వర్క్ విస్తరించిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

BSNL 4G: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం 4G నెట్ వర్క్ విస్తరించిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇప్పుడు ఆఫర్స్ తో కూడా యూజర్లను బాగా ఆకర్షిస్తుంది. అటువంటి ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లలో ఒక బెస్ట్ ప్లాన్ తో కేవలం రూ. 200 ఖర్చుతో 30 రోజులు డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోవచ్చు.

BSNL 4G: ఏమిటి ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన రూ. 99 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఇది 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ ను రెండు సార్లు రీఛార్జ్ చేస్తే కేవలం రూ. 198 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, ఇది రెండు సార్లు రీఛార్జ్ చేస్తే టోటల్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి?

ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 15 రోజులు వ్యాలిడిటీ అందుతుంది. ఈ 15 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 50MB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అయితే, ఈ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను రెండు రీఛార్జ్ చేసుకుంటే నెల మొత్తం బెనిఫిట్స్ అందిస్తుంది. ఒకవేళ మీరు మరిన్ని లాభాలు కలిగిన ప్లాన్ ను ఇదే ధరలో కోరుకుంటే రూ. 229 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మీకు బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.

Also Read: boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ పూర్తిగా నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ నెల రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అంతేకాదు, నెల రోజుల పాటు రోజుకు 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40 Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

బిఎస్ఎన్ఎల్ 5జి తీసుకురావడానికి కూడా చాలా వేగంగా పని చేస్తోంది. ఇప్పటికే 5జి నెట్ వర్క్ పై పైలెట్ ప్రాజెక్ట్ ని కూడా కంప్లీట్ చేసింది. త్వరగా బిఎస్ఎన్ఎల్ 5జి నెట్ వర్క్ కూడా అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో 5జి నెట్ వర్క్ అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :