BSNL 1rs plan Azadi Ka Plan 2025 launched
BSNL Azadi Ka Plan: 2025 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. అదే, బీఎస్ఎన్ఎల్ యొక్క ‘ఆజాదీ కా ప్లాన్’. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది, అది కూడా 3G మరియు 4G నెట్ వర్క్ పై అందించింది. ఇది ప్లాన్ అనడం కంటే ‘ఉచితం’ అనడం మరింత ఉచితంగా ఉంటుంది. ఈ ప్లాన్ ను ప్రమోషనల్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ గా అందించింది. ఈ బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
2025 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా బీఎస్ఎన్ఎల్ అందించిన ప్రమోషనల్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఆజాదీ కా ప్లాన్ గా అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 1 రూపాయి రీఛార్జ్ తో యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది కేవలం ఆగస్టు 1వ అంటే, ఈరోజు నుంచి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది మరియు 2025 ఆగస్టు 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ను అందుకోవాలంటే ఈ ప్లాన్ గడువు ముగిసే లోపలే ఈ ఒక్క రూపాయి ప్లాన్ తో రీఛార్జ్ చేయాలి.
ఇది బీఎస్ఎన్ఎల్ యొక్క ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం కొత్త బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Also Read: iPhone 16e పై అమెజాన్ GFF Sale రూ.10,000 జబర్దస్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చెస్ కొత్త యూజర్లకు కేవలం 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వంటి ప్రయోజనాలు అందిస్తుంది. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ అయితే, బీఎస్ఎన్ఎల్ అందించిన ఈ అద్భుతమైన ఆఫర్ ను పొందవచ్చు.
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచుతున్న తరుణంలో ప్రభుత్వ టెలికాం కంపెనీ మాత్రం తన యూజర్లకు గొప్ప విలువైన మరియు చవక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది.