తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసా.!

HIGHLIGHTS

తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించేలా అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్

ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే ఏకైక టెలికం బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం

టెలికం కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించేలా అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసా? తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది BSNL మాత్రమే. ఎందుకంటే, కేవలం రూ. 1,198 రూపాయల ధరలో కూడా పూర్తిగా సంవత్సరం వ్యాలిడిటీని ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే ఏకైక టెలికం బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అందుకే, బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం. 

BSNL Rs. 147 Plan

ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 30 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంలభిస్తుంది. అంతేకాదు, 10GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత BSNL హలో ట్యూన్ లాభాన్ని కూడా పొందవచ్చు. 

BSNL Rs. 599 Plan     

తక్కువ ధరలో హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లిబాటు అవుతుంది. ఈ చెల్లుబాటు కాలానికి గాను డైలీ 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లను కూడా అందిస్తుంది. దీనితో పాటుగా Zing, PRBT, Astrotell మరియు రాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకూ అన్లిమిటెడ్ డేటా వినియోగ లాభాన్ని కూడా పొందవచ్చు.

BSNL Rs. 1,198 Plan     

చాలా చవక ధరలో తక్కువ సంవత్సరం మొత్తంగా ఉపయోగపడే ప్రీపెయిడ్ కోసం చూసే వారికి ఈ ప్లాన్ సరైంది. ఎందుకంటే, ఈ ప్లాన్  12 నెలల కాలానికి నెలకు 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS ల ప్రయోజనాన్ని అందిస్తుంది. అంతేకాదు, సింపుల్ గా, ఈ ప్లాన్ నెలకు 100 ఖర్చులో వచ్చే బెస్ట్  బడ్జెట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :