ఎయిర్టెల్ vs జియో vs బిఎస్ఎన్ఎల్ vs Vi : బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్!!

HIGHLIGHTS

తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే ప్లాన్స్

ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయి మరియు కస్టమర్ల బడ్జెట్ లోనే ఉంటాయి

యూజర్లు ఎక్కువగా ఈ బడ్జెట్ ప్లాన్స్ ఎంచుకుంటున్నారు

వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్నిలాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తక్కువ ధరకే ఎక్కువ లాభాలను అందించడంలో ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయి మరియు కస్టమర్ల బడ్జెట్ లోనే ఉంటాయి. వాస్తవానికి, లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేయవలసి వచ్చినా, ఎక్కువ రోజులు ఎక్కువ లాభాలను కూడా పొందవచ్చు. కానీ, ఈ ప్లాన్స్ కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించవలసి వస్తుంది. అందుకే, యూజర్లు ఎక్కువగా ఈ బడ్జెట్ ప్లాన్స్ ఎంచుకుంటున్నారు.

అందుకే, టెలికం సంస్థలు కూడా వారి కస్టమర్లను ఆకర్షించే విధంగా తక్కువ ఖర్చులో మరిన్ని ప్రయోజనాలతో కొన్ని బెస్ట్ ప్లాన్స్ అందించాయి. జియో,BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చుద్దాం.

ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్

ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ రూ.179 రూపాయలకు వస్తుంది. వినియోగదారులకు ఇది 28 రోజుల కాలానికి గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు 300 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియోలో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇక మరొక బెస్ట్ ప్లాన్ 265 రూపాయలకు వస్తుంది. ఇది డైలీ 1 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 209 రూపాయలకు వస్తుంది. వాస్తవానికి, రూ.155 రూపాయల ప్లాన్ ఉన్నాకూడా, అది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.209 ప్లాన్ ప్రకారం, కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, జియో యాప్‌ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. జియో యొక్క రెండవ ప్లాన్ 239 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

BSNL జియో యొక్క చౌకైన 28/30 రోజుల ప్లాన్

BSNL యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 153 రూపాయలకు వస్తుంది. ఈ రూ. 209 ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, 28 రోజుల ఉచిత PRBT(పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) తో కూడా వస్తుంది. BNSL యొక్క రెండవ ప్లాన్ 199 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 2 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్

Vodafone Idea చౌకైన 28 రోజుల ప్లాన్‌ను రూ.179 రూపాయలకు వస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు 28 రోజులకు గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 300 SMSలతో సహా  Vi సినిమాలు మరియు టీవీలకు ఉచిత యాక్సెస్ ఇవ్వబడుతుంది. Vi యొక్క రెండవ ప్లాన్ 269 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, Vi Movies & TV Basic కి యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :