Airtel Plans Removed another two budget prepaid plans
Airtel Plans Removed: రీసెంట్ గా బడ్జెట్ కాలింగ్ అండ్ SMS ఓన్లీ ప్లాన్స్ తొలగించి వాటి స్థానంలో రేటు పెంచి కొత్త ప్లాన్స్ అందించిన ఎయిర్టెల్, ఇప్పుడు మరో రెండు బడ్జెట్ ప్లాన్స్ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. అయితే, ఇది అన్లిమిటెడ్ లేదా కాలింగ్ ఓన్లీ ప్లాన్స్ మాత్రం కాదు. ఇది డేటా వోచర్స్ మరియు ఈ రెండు ప్లాన్స్ కూడా డేటా మరియు 20 కి పైగా OTT యాప్స్ అందించే ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ యాక్సెస్ కలిగి ఉంటాయి.
ఎయిర్టెల్ చాలా కాలంగా తన యూజర్లకు ఆఫర్ చేస్తున్న రూ. 121 మరియు రూ. 181 రెండు డేటా ప్లాన్స్ ఇప్పుడు లిస్ట్ నుంచి తొలగించింది. ఈ రెండు ప్లాన్స్ కూడా ఇప్పుడు ఎయిర్టెల్ ప్లాన్ నుంచి లిస్ట్ నుంచి అందుబాటులో ఉండవు. ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 30 చెల్లుబాటు అయ్యే డేటా ప్లాన్స్ మరియు 20 కంటే ఎక్కువ OTT లకు యాక్సెస్ అందించే ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకు వస్తాయి.
ఇక నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు కాబట్టి, ఈ ప్లాన్ మాదిరి బెనిఫిట్స్ అందించే ఇతర ప్లాన్స్ కోసం యూజర్లు చూడాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని ప్లాన్స్ ఇలాంటి లాభాలు అందించే ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో బెస్ట్ ప్లాన్ రూ. 100 రూపాయల డేటా ప్లాన్. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 15 వేల బడ్జెట్ లో 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఇది కాకుండా మరో బెస్ట్ బడ్జెట్ ప్లాన్ కూడా ఉంది. అదే రూ. 195 రూపాయల డేటా ప్లాన్. ఈ డేటా ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు 30 రోజులకు గాను 12 జీబీ స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు జియో హాట్ స్టార్ యాక్సెస్ తో పాటు Sony LIV మరియు మరో 20 OTT యాప్స్ కి యాక్సెస్ అందించే ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
ఒకవేళ మీరు కేవలం డేటా మాత్రమే కోరుకుంటే మరో బెస్ట్ డేటా ప్లాన్ కూడా వుంది. అదే, రూ. 165 రూపాయల డేటా ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 3ఓ రోజులకు గాను 12 జీబీ డేటా లభిస్తుంది.