AIRTEL యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది

Updated on 05-Nov-2019
HIGHLIGHTS

Bharati Axa యొక్క 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజితో ప్రకటించింది.

తన వినియోగదారులకు మంచి సేవలను అందించాడని, ఎయిర్టెల్ కొన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొస్తోంది. అయితే, ఈరోజు ప్రకటించింది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం మీకు మంచి లాభాలను అంధిస్తుంది. ఎయిర్టెల్ తన వినియోగదారులకు టెలికం ప్రయోజనాలతో పాటుగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని కొడా అందించదానికి తీసుకున్న చర్యల్లో భాగంగా, Bharati Axa తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం తరువాత ఒక కొత్త రూ. 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ను అన్ని ప్రయోజాలతో పాటుగా, Bharati Axa యొక్క 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజితో ప్రకటించింది.

Rs. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే,  Rs. 599 ప్రీపెయిడ్ ప్లానుతో  ఈ నెట్వర్కుకైనా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, రోజుకు 2GB హై స్పీడ్ డేటాతో వస్తుంది మరియు డైలీ 100 SMS లను కూడా అందిస్తోంది. ఇక ప్రధానంగా, అన్ని ప్రయోజాలతో పాటుగా Bharati Axa యొక్క 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజి కూడా మీకు దక్కుతుంది. అధనంగా, ఈ ప్లాన్ మీకు 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. మీరు చేసే తరువాతి రీఛార్జ్ తో ఈ ఇన్సూరెన్స్ అలాగే కొనసాగుతూ ఉంటుంది.  అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఢిల్లీ వంటి కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు రానున్నరోజుల్లో మిగిలిన అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ తీసుకురానున్నట్లు తెలిపారు.     

ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎలా పొందాలి ?

మీరు ఈ Rs. 599 ప్రీపెయిడ్ ప్లాన్ మొదటి రీఛార్జ్ చేసినతరువాత ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందడానికి, మీ వివరాలను SMS, Airtel Thanks App లేదా ఎయిర్టెల్ రిటైలర్ ద్వారా నమోదు చేసుకోవాల్సివుంటుంది. అయితే, ఈ ఇన్సూరెన్స్ కేవలం 18 నుండి 54 సంవత్సరాల వయసువారికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి ఎటువంటి మెడికల్ లేదా మాన్యువల్ పేపర్ వర్క్ లేదు కాబట్టి ఇది మీరు అప్లై చేసిన తరువాత డిజిటల్ పద్దతిలో వెంటనే మీకు అందుతుంది. అధనంగా, ఈ ఇన్సూరెన్స్ యొక్క  ఫిజికల్ పేపర్ ఎవరైనా వినియోగదారులు కోరుకుంటే, వారికీ వాళ్ళు కోరుకున్న అడ్రెస్ కి డెలివరీ కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.                               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :