airtel listed new 30 days prepaid plans after tariff hike
Airtel: భారతి ఎయిర్టెల్ టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత కొత్త 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ లను ఇప్పుడు పరిచయం చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లను 30 రోజుల వ్యాలిడిటీ తో పాటు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో అందించింది. ముందు కేవలం 28 రోజుల ప్లాన్ లను మాత్రమే లిస్ట్ చేసిన కంపెనీ DoT ఆదేశాల మేరకు కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ప్రవేశపెట్టింది.
ఎయిర్టెల్ ఇప్పుడు కొత్తగా మూడు 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. యూజర్లకు 30 రోజులు లేదా నెల రోజుల వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ లను టెలికాం కంపెనీలు అందించాలనే DoT సూచనల మేరకు ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది. ఇందులో రూ. 219, రూ. 355 మరియు రూ. 589 ప్లాన్స్ ఉన్నాయి.
ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, 3GB డేటా మరియు 300 SMS లాభాలను మరియు రూ. 5 టాక్ టైమ్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో ఎయిర్టెల్ హలో ట్యూన్ మరియు Wynk Music యాక్సెస్ కూడా అందిస్తుంది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్.!
ఇక రెండవ అన్లిమిటెడ్ ప్లాన్ రూ. 355 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 25 GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో హలో ట్యూన్స్, Wynk Music మరియు Apollo 24|7 సర్కిల్ మెంబర్ షిప్ కూడా అందుతుంది.
ఇక మూడవ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ఎయిర్టెల్ రూ. 589 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ కి గాను 50GB హాయ్ స్పీడ్ డేటా మరియు 300 SMS లను అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అంధిస్తుంది. అలాగే, హలో ట్యూన్స్, Wynk Music మరియు Apollo 24|7 సర్కిల్ మెంబర్ షిప్ కూడా అందిస్తుంది.
మొబైల్ ప్లాన్స్ మరియు మొబైల్ రీచార్జ్ కోసం Click Here