ఎయిర్టెల్ బంపర్ ధమాకా ఆఫర్ : కేవలం 168 రూపాయలకే రోజువారీ 1GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ 28 రోజుల చెల్లుబాటుతో. . ఈ ఆఫర్ కేవలం న్యూ ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా సిర్కిళ్లలో మాత్రమే

HIGHLIGHTS

అన్లిమిటెడ్ కాలింగ్,SMS,డేటా మరియు కాలర్ ట్యూన్ కూడా ప్యాకేజీగా ఈప్లాన్ తీసుకువస్తుంది.

ప్రస్తుతం వోడాఫోన్, రిలయన్స్ జియో నుండి వున్నా పోటీ కారణంగా, భారతీ ఎయిర్టెల్ తన బడ్జెట్ వినియోగదారులకి సరిగ్గా సరిపోయే మంచి ప్లాన్ తీసుకొచ్చింది. నిజంగా ఇది ఎయిర్టెల్ బంపర్ ధమాకా ఆఫర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో ఏవిధమైన FUP పరిధిలేని అన్లిమిటెడ్ కాలింగ్ ఇవ్వడంతో పాటుగా రోజువారీ 1GB డేటా ఇంకా రోజుకు 100 SMSల పరిమితితో అందిస్తుంది, అదికూడా 28 రోజుల చెల్లుబాటుతో. దీనితో పాటుగా ఉచిత కాలర్ ట్యూన్ ఇవ్వడం ఈ ప్లాన్ని మరింత ససమైనదిగా చేసిందని చెప్పొచ్చు.

అయితే, ప్రస్తుతానికి ఈ ప్లాన్ని కేవలం న్యూ ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా సిర్కిళ్లలో మాత్రమే అందిస్తుంది. మరికొన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ కేవలం 20 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. నిజానికి, ఈ ప్లాన్ దాదాపుగా ముందు నుంచే అందుబాటులోవున్న, రూ . 199 ప్లాన్ లోని డైలీ 1.4GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS పరిమితి వలనే అనిపిస్తుంది. ఈ ఆఫర్తో న్యూ ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా సిర్కిళ్లలోవున్న వినియోగదారులకి పూర్తి ప్యాకేజీతో వున్నా మంచి ప్లాన్ అందిందనిపిస్తుంది.        

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :