రూ. 500 ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలను అందించే Airtel బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

అన్లిమిటెడ్ లాభాలను అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్

కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలను మీరు అందుకుంటారు

Wynk Music యాక్సెస్ ని ఉచితంగా పొందవచ్చు

Airtel: రూ. 500 ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలను అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు మాట్లాడుకోనున్నాము. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తక్కువ ఖర్చులో వచ్చిన అన్లిమిటెడ్ లాభాలను అందిస్తాయి. ఈ ప్లాన్స్ తో కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలనుమీరు అందుకుంటారు. మరి, తక్కువ ఖర్చులో ఆల్ రౌండ్ ప్రయోజనాలను అఫర్ చేసే ఎయిర్టెల్ యొక్క ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.

ఎయిర్టెల్ రూ.179 ప్లాన్

ఎయిర్టెల్ యొక్క రూ.179 ప్లాన్ రూ.200 రూపాయల కంటే తక్కువ ఖర్చులో ఆల్ రౌండ్ ప్రయోజనాలతో వచ్చే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ఎయిర్టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో 2GB డేటా కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 300SMS ల లిమిటెడ్ కూడా లాభిస్తుంది. అంటే, ఎయిర్టెల్ రూ.179 ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలను మీరు అందుకోవచ్చు. దీనితో పాటుగా Free హలో ట్యూన్స్ మరియు Wynk Music యాక్సెస్ ని ఉచితంగా పొందవచ్చు.    

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్టెల్ యొక్క ఈ రూ.199 ప్లాన్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది మరియు 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ పూర్తి చెల్లుబాటు కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 300 SMS లిమిట్ తో పాటుగా రూ. 5 రూపాయల మెయిన్ బ్యాలెన్స్ ను కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా Free హలో ట్యూన్స్ మరియు Wynk Music యాక్సెస్ ని యూజర్లు ఉచితంగా అందుకుంటారు. 

ఈ రెండు ప్లాన్స్ కూడా లిమిటెడ్ డేటా తో వస్తాయి.అయితే, కాలింగ్ మాత్రమే కోరుకునే వారికి కూడా ఒక ప్లాన్ వుంది. అదే, ఎయిర్టెల్ రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు. 

ఎయిర్టెల్ రూ.155 ప్లాన్

ఎయిర్టెల్ రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే, ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 1GB హై స్పీడ్ డేటా మరియు 300 SMS ల ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా Free హలో ట్యూన్స్ మరియు Wynk Music యాక్సెస్ ని అందిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :