Airtel గుడ్ న్యూస్: అధిక ప్రయోజనాలతో రెండు కొత్త ప్లాన్స్ విడుదల..!!

HIGHLIGHTS

ఎయిర్టెల్ అధిక ప్రయోజనాలతో రెండు కొత్త ప్లాన్స్ విడుదల చేసింది

పూర్తి నెలరోజులు ఆనందించేలా ఈ కొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది

అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు SMS ప్రయోజనాలు

కొత్తగా ఎయిర్టెల్ అధిక ప్రయోజనాలతో రెండు కొత్త ప్లాన్స్ విడుదల చేసింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ నెల రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. వీటిలో, 1 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటే మరొకటి 31 రోజుల వ్యాలిడిటీని కలిగివుంటుంది. అంతేకాదు, ఈ రెండు ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు SMS ప్రయోజనాలతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఒక నెల ఉచిత యాక్సెస్ వంటి లాభాలను అందిస్తుంది. అదికూడా, పూర్తి నెలరోజులు ఆనందించేలా ఈ కొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది.

ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రూ.296 మరియు  రూ.319 రూపాయల ధరలో ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్ కూడా మీకు అదనపు బెనిఫిట్స్ తో వస్తాయి. ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఒక చిన్న తేడా వుంది. అదేమిటంటే, ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, ఎయిర్టెల్ రూ.319 ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది.

ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.                                            

ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.

మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :