Airtel ట్రిపుల్ బెనిఫిట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

యిర్టెల్ వినియోగదారులకు అన్నివిధాలా ఉపయోగపడేలా కొన్ని ప్లాన్స్

కరోనా వైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. టీవీ మరియు ఆన్లైన్ సినిమాలతో పాటుగా గేమింగ్ మరియు మ్యూజిక్ వంటి వాటితో ఎక్కువగా కాలాన్నిగడుపుతున్నారు. అటువంటి వారికి, అన్ని ప్రధాన టెలికం సంస్థలు కూడా మంచి ఆఫర్లను అందించాయి. అయితే, కేవలం కాలింగ్ మరియు డేటా మాత్రమే కాకుండా మరిన్ని లాభాలను తెచ్చిపెట్టే ప్లాన్స్ కోసం చూసేవారికి ఎయిర్టెల్ అందిస్తున్న ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే , ఎయిర్టెల్ వినియోగదారులకు అన్నివిధాలా ఉపయోగపడేలా కొన్ని ప్లాన్స్ ను ఈ మధ్యకాలంలో ప్రవేశపెటింది. వాటిలో మీకుఅధిక ప్రయోజనాలను అందించే 3 ప్లాన్స్ గురించి ఈరోజు ఇక్కడ వివరిస్తున్నాను.

1.ఎయిర్టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ యొక్క ఈ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ ఎక్కువగా చేసేవారికి సరిపోతుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా మాత్రం ఉండదు. ఎందుకంటే, ఈప్లానుతో మీకు కేవలం 2GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈప్లానుతో వచ్చే SMS లు కూడా కేవలం 300 మాత్రమే.  అయితే, ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి.                                

 

1. లైఫ్ ఇన్సూరెన్స్  : ఈ ప్లానుతో మీకు 2 లక్షల రూపాయల భారతి AXA జీవిత భీమా ఉచితంగా దొరుకుతుంది. 

2. ఉచిత మ్యూజిక్ యాప్ యాక్సెస్ : దీనితో Wink Music యాప్ యొక్క 1 నెల ప్రీమియం యాక్సెస్ పొందవచ్చు.

3. ఎయిర్టెల్ Xtream App యొక్క యాక్సెస్ అందుతుంది. అధనంగా ఫ్రీ హలో ట్యూన్స్ కూడా నెలంతా పొందవచ్చు.     

2.ఎయిర్టెల్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఈ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది మాత్రం ఉండదు. ఈప్లానుతో మీకు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటా  లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 42GBడేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి.                                

1. లైఫ్ ఇన్సూరెన్స్  : ఈ ప్లానుతో మీకు 4 లక్షల రూపాయల భారతి AXA జీవిత భీమా ఉచితంగా దొరుకుతుంది. 

2. Rs.150 క్యాష్ బ్యాక్ : దీనితో మీకు ఫాస్ట్ టాగ్స్ పైన 150 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

3. ఎయిర్టెల్ Xtream App యొక్క యాక్సెస్ అందుతుంది. అధనంగా, నెలంతా ఫ్రీ హలో ట్యూన్స్ తో పాటుగా షా అకాడమీలో 4 వారాల ఉచిత కోర్స్ కూడా  పొందవచ్చు.     

3.ఎయిర్టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

4. ఉచిత Anti Virus యాక్సెస్ అందుతుంది.

ఇక ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఇది కూడా అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది. ఈప్లానుతో మీకు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా  లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 56GB డేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి.                                

1. అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ : ఈ ప్లానుతో మీకు 1 నెలఅమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా దొరుకుతుంది. 

2. Rs.150 క్యాష్ బ్యాక్ : దీనితో మీకు ఫాస్ట్ టాగ్స్ పైన 150 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

3. ఎయిర్టెల్ Xtream App యొక్క యాక్సెస్ అందుతుంది. అధనంగా, నెలంతా ఫ్రీ హలో ట్యూన్స్ తో పాటుగా షా అకాడమీలో 4 వారాల ఉచిత కోర్స్ కూడా  పొందవచ్చు.      

4. ఉచిత Anti Virus యాక్సెస్ అందుతుంది.

అన్ని రీఛార్జ్ ప్లాన్స్ కోసం ఇక్కడ (LINK) చూడవచ్చు  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :