Airtel Best Plan one year plan with more benefits
Airtel Best Plan: ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేస్తోంది. వాటిలో కొన్ని ప్లాన్స్ చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎయిర్టెల్ యూజర్ల కోసం అందించిన బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1799 కూడా ఇదే కేటగిరీకి చెందుతుంది.
సంవత్సరం మొత్తం వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వారి కోసం ఈ రూ. 1799 ప్లాన్ ను ఎయిర్టెల్ తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులు, అంటే పూర్తిగా వన్ ఇయర్ వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు వివరంగా చూద్దాం.
Also Read: Gold Market Update: మెల్లగా పెరుగుతున్న గోల్డ్ మార్కెట్.!
ఎయిర్టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే, లోకల్ మరియు STD లకు కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ను వన్ ఇయర్ వరకూ అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 3600 SMS లిమిట్ ను అందిస్తుంది.
అంతేకాదు, ఈ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులకు గాను 24GB డేటాని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో మూడు నెలల Apollo 24|7 Circle యాక్సెస్, Free Hello Tunes మరియు Wynk Music యాప్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఈ బడ్జెట్ ప్లాన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, డేటా అవసరం ఎక్కువ లేకుండా కాలింగ్ కోసం రీఛార్జ్ చేయదలచిన వారికి సరిపోతుంది.
ఎయిర్టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ను నెల వారీగా లెక్కిస్తే, ఈ ప్లాన్ కోసం నెలకు కేవలం రూ. 150 రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు అవుతుంది.
గమనిక: ఈ ప్లాన్ తో ఎటువంటి 5జి డేటా లాభాలు అందవని గమనించాలి.