Airtel New Plans: ఎయిర్టెల్ రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది.!

Updated on 24-Jan-2025
HIGHLIGHTS

ఎయిర్టెల్ ఈరోజు రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను జత చేసింది

కేవలం కాలింగ్ కోసం బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది

ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలాని అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది

Airtel New Plans: ఎయిర్టెల్ ఈరోజు తన పోర్ట్ ఫోలియోకి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను జత చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) ఇటీవల అందించిన ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ యూజర్లకు అందించడం తప్పనిసరి అయ్యింది. అందుకే, ఎయిర్టెల్ ఈ రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.

Airtel New Plans:

ఎయిర్టెల్ రూ. 1,959 మరియు రూ. 499 రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఇందులో, మొదటి ప్లాన్ ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తే, రెండవ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రెండు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

ఎయిర్టెల్ రూ. 1,959 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ఎయిర్టెల్ రూ. 1,959 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు, అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 3600 SMS లను కూడా అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ యొక్క ఈ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు టోటల్ 900 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.

Also Read: Jio New Plans: మినిమం రేటుతో కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో.!

అయితే, ఇక్కడ తెలిపిన రెండు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా కేవలం వాయిస్ మరియు డేటా మాత్రమే అందిస్తాయి. కానీ, ఈ రెండు ప్లాన్స్ డేటా లేదా మరే ఇతర ప్రయోజనాలు మాత్రం అందించవు.

మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :