a report said govt blocked more than 1 core sim cards
2023 లో భారీగా పెరిగిన ఆన్లైన్ మోసాల సంఖ్య చూసిన తర్వాత, ప్రభుత్వం స్కామర్లను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి సూచనగా కొత్త అప్డేట్స్ మరియు సంబంధిత వార్తలు మరియు ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన కొత్త సర్వీసులు కూడా ఉదాహరణలుగా నిలుస్తాయి. త్వరలో 18 లక్షల మొబైల్ కనెక్షన్ లను ప్రభుత్వం బ్లాక్ చేయబోతోందనే వార్త తర్వాత, 1 కోటికి పైగా SIM Card లను బ్లాక్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.
ప్రభుత్వం 1 కోటికి పైగా సిమ్ కార్డ్ లని బ్లాక్ చేసింది , అని కొత్త నివేదిక తెలిపింది. ఈ విషయాన్ని News18 నివేదించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఏప్రిల్ 30వ తేదీ వరకు టెలికాం మినిస్ట్రీ దాదాపు 1.66 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్ లను తొలగించినట్లు తెలిపింది. అంతేకాదు, ఈ విషయాన్ని అఫీషియల్స్ న్యూస్18 కి తెలిపినట్లు కూడా చెప్పింది.
దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు సరైన వెరిఫికేషన్ లేదా స్కామ్ లకు సంబంధం కలిగినట్లుగా భావిస్తున్న మొబైల్ కనెక్షన్ లను తొలగించినట్లు చెబుతున్నారు. ఇది ఇప్పటి వరకూ తొలగించిన మొబైల్ కనెక్షన్ ల వివరాలు కాగా, త్వరలోనే 18 లక్షల సిమ్ కార్డ్ లను ప్రభుత్వం తొలగించ బోతోందనే వార్త కూడా బయటకి వచ్చింది.
Also Read: itel Unicorn: పెండెంట్ Smart Watch ను తెచ్చిన ఐటెల్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
మొబైల్ కాల్స్, SMS మరియు వాట్సాప్ ల ద్వారా స్కామర్లు బాధితులకు ఉచ్చు బిగిస్తున్నారు. అందుకే, ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి, స్కామ్ లకు సంబంధం వున్న మొబైల్ కనెక్షన్ ల పైన టెలికాం మినిస్ట్రీ కఠిన చర్యలు తీసుకుంటోంది.
వాస్తవానికి, ప్రజలు వారి మొబైల్ కనెక్షన్ లను చెక్ చేసుకోవడానికి ముందుగా TAFCOP సర్వీస్ ను తీసుకు వచ్చిన ప్రభుత్వం, దానికి మరింత సహకారంగా సంచార్ సాథీ (SANCHAR SAATHI) ని కూడా తీసుకు వచ్చింది. TAFCOP ద్వారా యూజర్ పేరు మీద ఉన్న అన్ని మొబైల్ నెంబర్ లను తెలుసుకోవచ్చు మరియు వారు ఉపయోగించని నెంబర్ ని బ్లాక్ చేసే అవకాశం వుంది.
SANCHAR SAATHI ద్వారా పోగొట్టుకున్న మొబైల్ నెంబర్ బ్లాక్ మరియు ఫోన్ పైన కంప్లైంట్ ను రిజిస్టర్ చేసే అవకాశం అందించింది.