షావోమి రెడ్మి నోట్ 7 ప్రో : రూ. 13,999 ప్రారంభ ధరతో విడుదల

HIGHLIGHTS

రెడ్మి నోట్ 7 ప్రో ఒక 48MP Sony IMX586 సెన్సారుతో విడుదలయ్యింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను, షావోమి ఇప్పుడు ఇండియాలో లాంచనా ప్రాయంగా విడుదల చేసింది. ఈ రోజు నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ముందుగా,చైనాలో విడుదల చేయబడిన  ఫోన్ వెనుక ఒక 48MP ప్రధాన కెమెరాతో విడుదలైయ్యింది. కానీ, ఇండియాలో రెడ్మి నోట్ 7 ఫోన్ను కేవలం 12MP కెమేరాతో మాత్రం అందించింది. కేవలం  దీనితో పాటుగా రెడ్మి నోట్ 7 యొక్క సాధారణ వేరియంట్ అయినటువంటి, 3GB/32GB వేరియంట్ రూ. 9,999 ధరతో ప్రారంభమవుతుంది. రెడ్మి నోట్ 7 ప్రో యొక్క 4GB /64GB ఈవేరియంట్ రూ.13,999 ధరతో అందుతుంది. రెడ్మినోట్ 7 స్మార్ట్ ఫోన్, Flipkart మరియు mi.com నుండి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి  మొదటి సరిగా అమ్మకానికి  రానుంది. అయితే, రెడ్మినోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మాత్రం మార్చి 13 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది.          

రెడ్మి నోట్ 7 ధర

1. రెడ్మి నోట్ 7  – 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ : రూ. 9,999

2. రెడ్మి నోట్ 7  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 11,999

రెడ్మి నోట్ 7 ప్రో ధర

2. రెడ్మి నోట్ 7 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999

3. రెడ్మి నోట్ 7 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999

రెడ్మి నోట్ 7 ప్రో  ప్రత్యేకతలు       

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ ను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో  యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.  ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది. ఇందులో అతితక్కువ 1.6um 4-ఇన్-1 సూపర్ పిక్సెల్స్ తో అద్భుతంగా ఉంటుంది, ఈ కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది.  ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణంతో ఉంటాయి, సామాన్యంగా ప్రస్తుత ఫోనులో ఇది కేవలం 4MB నుండి 6MB మధ్య ఉంటుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :