ఇండియాలో, షావోమి నుండి సరికొత్త విడుదల చేయబడిన, రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు లక్షణాలతో వస్తుంది. వాస్తవానికి, ఒక 48MP ప్రహెచ్డీన కెమేరాతో చనలో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్, ఇండియాలో మాత్రం 12MP ప్రధాన కెమెరాలో విడుదల చేయ్యబడింది. ఇక రియల్మీ కంపెనీ, ఇటీవలే బడ్జెట్ సెగ్మెంట్లో తన రియల్మీ3 ని తక్కువ ధరలో మంచి ఫిచర్లతో విడుదల చేసింది. త్వరలో అమ్మకానికి రానున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్లను వాటి స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా సరిపోల్చి, ఏది కొనడానికి సరైన ఎంపికగా ఉంటుందో చూద్దాం.
డిస్ప్లే & డిజైన్
షావోమి రెడ్మి నోట్ 7, డిస్ప్లే పైన ఒక డోట్ (వాటర్ డ్రాప్) నోచ్ కలిగి, ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది.అదనంగా, ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని రక్షణగా అందించారు. ఇక రియల్మీ3 విషయానికి వస్తే, ఇది ఒక 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో మరియు వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనతో 1520×720 పిక్సెళ్ళు అందించగల ఒక 6.3-అంగుళాల HD + స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ రియల్మీ 3 యొక్క ప్యానెల్ కోసం రియల్మీ, ఒక గ్రేడియంట్ కలర్ డిజైన్ ని అందించింది. ఈ డిస్ప్లే & డిజైన్ విషయంలో, షావోమి రెడీమి నోట్ 7 కొంచెం అధికంగా ఉంటుంది.
పర్ఫార్మెన్స్
రెడ్మి నోట్ ఫోన్ స్మార్ట్ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా 3GB మరియు 4GB RAM వేరియంట్లలో 32GB మరియు 64GB స్టోరేజిలలో లభిస్తాయి. అలాగే ఇది ఒక 4,000 mAh బ్యాటరీతో గొప్ప సామర్థ్యంతో వస్తుంది. మరొకవైపు, రియల్మీ 3 ఒక 2.1GHz వేగం వరకు క్లాక్ చేయగల 12nm మీడియా టెక్ హీలియో P70 SoC పై నడుస్తుంది. అలాగే, ఒక 4,230 mAh బ్యాటరీ యొక్క గొప్ప సామర్థ్యంతో వస్తుంది. ఈ విభాగంలో, రియల్మీ కొంచెం అధికంగా ఉంటుంది. ఎందుకంటే, స్నాప్ డ్రాగన్ 660 SoC ఒక 14nm FinFET సాంకేతికతతో వస్తుంది, కానీ రియల్మీ 3 12nm FinFET సాంకేతికతతో వస్తుంది. కాబట్టి, రియల్మీ కొంచెం వేగంగా ఉంటుంది మరియు బ్యాటరీ కూడా కొంచం ఎక్కువ సామర్ధ్యంతో ఉంటుంది.
కెమేరా
రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్, పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 2MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ఒక ప్రధాన 12MP సెన్సారు కలిగి ఉంటుంది. అయితే ముందుగా, చైనాలో విడుదల చేసిన విధంగా, ఈ నోట్ 7 ఒక 48MP కెమేరాతో అందించబడినట్లయితే కనుక, కచ్చితంగా ఈ ధరలో దీనికి ఏమాత్రం పోటీ ఉండేది కాదు. కానీ, సంస్థ మాత్రం దీన్ని ఒక 1.12μm లార్జ్ పిక్సెల్స్ అందించగల ఒక 12MP ప్రధాన కెమెరాతో విడుదల చేసింది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది. మరొకపైపు, రియల్మ్ 3 స్మార్ట్ ఫోన్ వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్పుతో వస్తుంది. ఈ 13MP ప్రధాన కెమెరా 5P లెన్స్ మరియు ఒక f / 1.8 ఎపర్చరుతో 1.12μm పిక్సెల్ పిచ్ కలిగి ఉంది. ఇక ఈ 2MP సెకండరీ సెన్సార్ 1.75μm మరియు f / 2.4 ఎపర్చరు లెన్స్ యొక్క పిక్సెల్ పిచ్ కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క కెమెరా హైబ్రిడ్ HDR మద్దతుతో పాటు PDAF మరియు బోకె చిత్రాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఏ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క కెమేరాతో స్లోమోషన్ వీడియో లను తీసుకోవచ్చు. ఈ విభాగంలో, దాదాపుగా రెండు కూడా చిన్నచిన్న తేడాలతో సమానంగానే ఉంటాయి.
ధర మరియు మొదటి సేల్
Redmi Note 7 ధర
1. రెడ్మి నోట్ 7 – 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ : రూ. 9,999
2. రెడ్మి నోట్ 7 – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 11,999
Redmi Note 7 మొదటి సేల్ : మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.
RealMe 3 ధర
1. రియల్మీ 3 – 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ : రూ. 8,999
2. రియల్మీ 3 – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 10,999
RealMe 3 మొదటి సేల్ : మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.