రెడీమి నోట్ 7 వచ్చేస్తోంది

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 28 వ తేదీన ఇండియాలో విడుదలకానుంది.

షావోమీ రెడ్మి నోట్ 7 ఇండియాలోకి ఎప్పుడు లాంచ్ కానుంది ? అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రశ్నకు ఇప్పుడు తెరపడింది. ఎందుకంటే, ఫిబ్రవరి 28 వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి టైం సెట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, విడుదలైన మూడు వారాలలోనే చైనాలో 10 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అత్యంత సరసమైన ధరలో ఒక 48MP కెమేరా మరియు మంచి డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ ఉండడమే అందుకు కారణంగా చెప్పవచ్చు.

రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు

డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఈ రెడ్మి నోట్ 7,  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల LCD ప్యానెల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా  3GB, 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 32GB లేదా 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా 5MP సెకండరీ సెన్సారుతో కలిపి 48MP సెన్సారు కలిగిన మొదటి Redmi ఫోన్ ఇది. ఈ నోట్ 7 యొక్క 48MP సెన్సార్ తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని  కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సోనీ సంస్థ  వెల్లడించింది. ఇందులో అతితక్కువ 0.8um అంగుళాల పిక్సెళ్ళు నిజంగా బాగుంటుంది, కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. Xiaomi ప్రకారం, Redmi Note 7 పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని చెబుతోంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.

 ఇక ఈ రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ చైనాలో 3G + 32GB వేరియంట్ ధర 999 యువాన్(సుమారు 10,381 రూపాయల) నుంచి రెడ్మి నోట్ 7 ప్రారంభిస్తుంది. అయితే 4GB + 64GB వేరియంట్ 1199 యువాన్ (దాదాపు రూ .12,455) మరియు 6GB + 64GB వేరియంట్ 1399 యువాన్ (దాదాపు రూ. 14,532). అయితే,  భారతదేశంలో కూడా ఇలాంటి ధారలతోనే విడుదలచేయవచ్చని అంచనా వేస్తున్నారు, కానీ ఎలాఉంటాయో వేచిచూడాల్సిందే.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :