షియోమీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 10A ఫస్ట్ సేల్..!!
Xiaomi సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 10A
ఏప్రిల్ 26 న మొదటిసారిగా అమ్మకానికి రానుంది
షియోమీ ఈ రెడ్‌మి 10ఎ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రకటించింది
Xiaomi సరికొత్తగా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 10A. ఈ స్మార్ట్ ఫోన్ ఎల్లుండి, అనగా ఏప్రిల్ 26 న మొదటిసారిగా అమ్మకానికి రానుంది. షియోమీ ఈ రెడ్‌మి 10ఎ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రకటించింది. బడ్జెట్ ధరలో వచ్చినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్ టెండేడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో వచ్చింది.
SurveyRedmi 10A : ధర
షియోమి రెడ్‌మి 10ఎ బేసిక్ వేరియంట్ 3 జిబి + 32 జిబి వేరియంట్ ధర రూ .8,499 మరియు 4 జిబి + 64 జిబి వేరియంట్ ధర రూ .9,499 రూపాయలుగా ప్రకటించింది. ఏప్రిల్ 26 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి ఈ ఫోన్ అమ్మకానికి వస్తుంది.
Redmi 10A: స్పెక్స్
షియోమి రెడ్‌మి 10ఎ ఒక 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. Redmi 10A ఫోన్ స్క్రీన్ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 194 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. రెడ్‌మి 10A చార్కోల్ బ్లాక్, సీ బ్లూ మరియు స్లేట్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
Redmi 10A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ కి జతగా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. అదనంగా, 1జీబీ RAM బూస్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.
రెడ్‌మి 10ఎ లో వెనుక క్వాడ్ కెమెరా అనిపించేలా సెటప్ వున్నా కూడా 13 ఎంపి కెమెరా సింగల్ కెమెరాని మాత్రమే అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. షియోమి రెడ్‌మి 10A లో 5,000 mAh బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile