ఈ రోజే మరి కొద్ది సేపట్లో Xiaomi పవర్ బ్యాంక్ అండ్ మొబైల్స్ ఫ్లాష్ సేల్స్

 Xiaomi ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు Mi.com వెబ్ సైట్ లో రెడ్మి నోట్ 3 మొబైల్ మరియు Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్స్ అండ్ 20000 mah పవర్ బ్యాంక్ ను ఫ్లాష్ సేల్స్ లో సేల్ చేస్తుంది.

ఇది మూడవ ఫ్లాష్ సేల్స్. అయితే బడ్జెట్ లో మంచి ఫోన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెడ్మి నోట్ 3 మాత్రం కేవలం 16gb వేరియంట్ సేల్ అవుతుంది. దీని ప్రైస్ 9,999 రూ. రెడ్మి నోట్ 3 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగాలురు. Mi 5 కంప్లీట్ తెలుగు రివ్యూ లింక్.

కాని నా సలహా ప్రకారం 32gb వేరియంట్ మంచి చాయిస్. స్టోరేజ్ తో పాటు ర్యామ్ కూడా ఎక్కువుగా ఉంటుంది. దీని ప్రైస్ 11,999 రూ. అంటే మొదటి వేరియంట్ కన్నా రెండు వేలు ఎక్కవు. 

3GB ర్యామ్ 32gb స్టోరేజ్ వేరియంట్ ఎప్పుడు సేల్ అవనుందో ఇన్ఫర్మేషన్ లేదు. సో పవర్ users ఎవరైనా ఉంటే దాని కొరకు వెయిట్ చేస్తే బెటర్. casual గానే ఫోన్ వాడే వారికి 9,999 వేరియంట్ సరిపోతుంది.

సేల్స్ లో వీటిని కొనటానికి ముందుగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే వెబ్ సైట్ యొక్క లాంగ్ in ఐడి ఉండాలి. 20000 mah పవర్ బ్యాంక్ కూడా 1,699 రూ లకు సేల్ అవుతుంది. మూడూ ఒకే టైమ్(2PM) కు సేల్స్ అవుతాయి.

రెడ్మి నోట్ 3 యొక్క కంప్లీట్ తెలుగు రివ్యూ ను క్రింద వీడియో లో కూడా చూడగలరు..

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :