స్టాక్ ఉన్నంత వరకే: సగం ధరకే లభిస్తున్న షియోమీ బెస్ట్ ఫోన్.!

HIGHLIGHTS

సగం ధరకే లభిస్తున్న షియోమీ బెస్ట్ ఫోన్

mi.com నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు

క్లియరెన్స్ సేల్ నుండి ఈ పటాకా అఫర్ ను అనౌన్స్ చేసింది

స్టాక్ ఉన్నంత వరకే: సగం ధరకే లభిస్తున్న షియోమీ బెస్ట్ ఫోన్. షియోమీ ఇటీవల ప్రకటించిన క్లియరెన్స్ సేల్ నుండి ఈ పటాకా అఫర్ ను అనౌన్స్ చేసింది. అయితే, ఈ అఫర్ లేటెస్ట్ ఫోన్ల పైన మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. Redmi 6A, Redmi Y3 మరియు Redmi Note 7 Pro వంటి పాత తరం బెస్ట్ ఫోన్లను సగం ధరకు అఫర్ చేస్తోంది మరియు వీటిని mi.com నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

పాత తరం ఫోన్లు కదా అని వీటిని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే, ఇండియాలో మొట్టమొదటి 48ఎంపీ Sony IMX586 సెన్సార్ కలిగిన స్మార్ట్ ఫోన్ గారెడ్ మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ పేరుపొందింది. ఈ ఫోన్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించవచ్చు. ఈ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.5,999 అఫర్ ధరకే మీ సొంతం చేసుకునే అవకాశం షియోమీ మీకు అందించింది.

కేవలం Redmi Note 7 Pro స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు Redmi 6A స్మార్ట్ ఫోన్ కూడా సగం ధరకే, అంటే రూ.3,999 రూపాయలకే సేల్ చేస్తోంది. మరింకెదుకు ఆలశ్యం మీరు కూడా చావా దరకే మంచి కొనాలనుకుంటే mi.com వెబ్సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా ఇక్కడ అందించిన Check offer Here  పైన క్లిక్ చేసి అఫర్ ను చెక్ చేయవచ్చు.                                  

Redmi Note 7 Pro: స్పెక్స్

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో పెద్ద 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో 5th జెనరేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని కలిగి వుంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజి లలో లభిస్తుంది. ఈ ఫోన్ 4,000 mAh బ్యాటరీతో వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది.  ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదు. ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణం వరకూ ఉంటాయి.  ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :