షావోమి ఫోన్ల కోసం MIUI 11 ROM వచ్చేస్తోంది : అప్డేట్ అందుకోనున్న 38 ఫోన్లు

Updated on 16-Feb-2019
HIGHLIGHTS

షావోమి ఈ బీటా అప్డేట్లను విడుదల చేస్తోంది మరియు దాని MIUI 10 అప్డేటుకు కొత్త ఫీచర్లను జోడించింది.

ప్రస్తుతం, షావోమి ఈ బీటా అప్డేట్లను విడుదల చేస్తోంది మరియు దాని MIUI 10 అప్డేటుకు కొత్త ఫీచర్లను జోడించింది. అయితే ,  MIUI యొక్క తదుపరి అప్డేటును అందించడాని, పనిచేయడం ప్రారంభించినున్నట్లు, జనవరిలోనే కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు, MyDrivers ద్వారా వచ్చిన ఒక కొత్త నివేదిక, అప్డేట్ కోసం అర్హత కలిగిన షావోమి ఫోన్ల జాబితాను కూడా అందించింది.  రాబోయే Xiaomi ROM లో రానున్న కొత్త సమాచారం కూడా అందించబడింది. ఈ రిపోర్టు ప్రకారం, షావోమి  పూర్తిగా కొత్త ROM తో మొత్తం ROM ను కొత్త ఇంటర్ఫేసుతో పునఃరూపకల్పన చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని, "స్మూత్ అండ్ బ్యూటిఫుల్," "న్యూ ఐకాన్," "గ్లోబల్ నైట్ మోడ్" థీమ్ లను అమలుచేయండంతో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లని ఈ కొత్ అప్డేట్ తీసుకొస్తుంది.

నివేదిక ప్రకారం, కొత్త MIUI 11 ROM ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. సంస్థ దాని ప్రామాణిక విడుదల షెడ్యూల్ కు కట్టుబడి ఉంటే, కొన్ని నెలల్లో ఇది విడుదల కావచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న Mi 9 స్మార్ట్ ఫోనుతో పాటుగా, ఈ కొత్త MIUI 11 ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది, ఈ ఫోన్ను అతిత్వరలో  ప్రారంభించటానికి చూస్తోంది మరియు ఇది స్నాప్ డ్రాగన్ 855 SoC ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఈ కొత్త ROM అప్డేట్  స్వీకరించేందుకు అనుమతిగల హ్యాండ్ సెట్లను కూడా ప్రకటించారు.  షావోమి యొక్క ఆ స్మార్ట్ ఫోన్ల  జాబితా చుస్తే గనుక : షావోమి మి 9, మి 8, మి 6X, మి 6, మి 5c, మి 5X, మి 5s, మి 5s ప్లస్ మరియు మి ప్లే వంటివి ఉన్నాయి. ఇంకా, మి మిక్స్ సిరీస్లో, మి మిక్స్ 3, మి మిక్స్ 2S, మి మిక్స్ 2, మరియు మి మిక్స్ 1 లను,  ఈ కొత్త MIUI ROM తో అప్డేటుచేయవచ్చు. అలాగే,  మి నోట్ 2, మి నోట్ 3, మి మాక్స్ 2, మి మాక్స్, మి మాక్స్ 3, ఇతర డివైజెస్ కూడా ఉంటాయి.

రెడ్మి 6, రెడ్మి 6A, రెడ్మి 5, రెడ్మి 5A, రెడ్మి 5 ప్లస్, రెడ్మి 4X, రెడ్మి 4, రెడ్మి 4A, రెడ్మి 3S / 3X, మరియు రెడ్మి S2 వంటి కొన్ని రెడ్మి ఫోన్లు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నాయి. రెడ్మి నోట్ 4, రెడ్మి నోట్ 4X, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రో, రెడ్మి నోట్ 5A, రెడ్మి 6 ప్రో, రెడ్మినోట్ 6, రెడ్మి నోట్ 6 ప్రో, రెడ్మినోట్ 7, మరియు ఇంకా ప్రకటించని రెడ్మి నోట్ 7 ప్రో కూడా ఈ ఆరోపించబడిన MIUI 10 మరుసటి అప్డేట్ జాబితాలో భాగంగా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :