చైనీస్ సాఫ్ట్ వేర్ బెంచ్ మార్కింగ్ వేదిక అయినటువంటి, AnTuTu ఫిబ్రవరి నెలకి గాను టాప్ 10 ఉత్తమ పర్ఫార్మెన్క్ ఫోన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో, Xiaomi Mi 9 టాప్ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో లెనోవో Z5 ప్రో GT మరియు మూడవ స్థానాన్నినోబియా రెడ్ మేజిక్ మార్స్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఫోన్ దక్కించుకుంది. అయితే, ఈ జాబితా చైనాలో ప్రారంభించిన ఫోన్లను మాత్రమే కలిగి ఉంది, అందుకే శామ్సంగ్ యొక్క తాజా S10 ఫ్లాగ్షిప్ డివైజెస్ ఇందులో చేర్చబడలేదు.
ఫిబ్రవరి మూడవ వారంలో ప్రారంభించిన Xiaomi Mi 9, సరికొత్తగా రావడమేకాకుండా ఒక 371,849 సగటు బెంచ్ మార్కింగ్ స్కోర్ సాధించి ఈ జాబితాలో టాప్ ప్లేస్ పొందింది. జనవరిలో ప్రారంభించబడిన, లెనోవా Z5 ప్రో GT సగటు బెంచ్ మార్కింగ్ స్కోర్ 353,469 తో రెండో స్థానాన్ని పొందింది. ఇవి రెండు కూడా, క్వాల్కమ్ యొక్క ప్రధాన ప్రోసెసర్ స్నాప్డ్రాగెన్ 855 యొక్క శక్తితో ఈ ఫోన్లు వచ్చాయి. ఇక నోబియా రెడ్ మాజిక్ మార్స్ గేమింగ్ ఫోన్ 320.763 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ద్వారా ఆధారితమైనది.
షావోమి Mi 9, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ మరియు వేనుక ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగివున్న మొట్టమొదటి ఫోనుగా చెప్పవచ్చు. లెనోవా తాజా ప్రధాన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 ప్రాసెసరుతో వచ్చిన ప్రపంచలో మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా, సంస్థ గుర్తింపు పొందింది, ఇది 12GB RAM ను కలిగి ఉన్న మొట్టమొదటి పరికరం.
ఒక కిరిణ్ 980 చిప్సెట్ తో నడిచే హువావే మేట్ 20, 306,984 స్కోరుతో నాల్గవ స్థానానికి చేరుకుంది, దీని తరువాత హానర్ V20 తన 306,726 స్కోరుతో తదుపరి స్థానంలో నిలచింది. అలాగే, మేట్ 20 X ఫోన్ 304,325 పాయింట్లతో ఆరవ స్థానానికి చేరుకుంది మరియు హానర్ మాజిక్ 2 తన 301,442 స్కోరుతో ఏడో స్థానంలో ఉంది. ఇక అసూస్ ROG ఫోన్, Xiaomi యొక్క బ్లాక్ షార్క్ Helo గేమింగ్ స్మార్ట్ఫోన్ మరియు షావోమి మి 8 ఇన్ డిస్ప్లే ఫిగేర్ ప్రింట్ ఎడిషన్ వంటివి, వరుసగా 297,953, 297,473 మరియు 296,953 పాయింట్లతో జాబితా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఫోన్లు స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ను కలిగి ఉంటాయి.