షావోమి నుండి దాని ప్రధాన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి షావోమి Mi 10 ఇండియాలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈరోజు లాంచ్ చేయబడింది. ఈ ఫోనుతో పాటుగా కంపెనీ Mi Box మరియు MiTrueWireless Ear Buds 2 ను కూడా విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్, వన్‌ప్లస్ 8 సిరీస్ తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లో మరికొన్ని స్మార్ట్ ఫోన్ల సరసన పోటీకి నిలబడబోతోంది.
షావోమి మి 10 మొట్టమొదట మార్చి 31 న ప్రారంభించాల్సి ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా ఇది దీని లాంచ్ డేట్ వాయిదా పడింది. కానీ ఎట్టకేలకు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ప్రారంభించబడింది. అయితే, దీనిని భారత ప్రభుత్వం నిర్ణయించిన గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లలో మాత్రమే అమ్మవచ్చు.
షావోమి మి 10 స్మార్ట్ ఫోన్ రెండు వేర్వేరు వేరియంట్లలో లాంచ్ చేయబడింది, మీరు ఈ మొబైల్ ఫోన్ యొక్క 8 GB ర్యామ్ 128 జిబి మరియు 256 GB మోడళ్లలో ఎంచుకోవచ్చు. ఈ రెండు వేరియంట్ల ధర గురించి చూస్తే, మీరు బేస్ వేరియంట్ ను 49,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, టాప్ మోడల్ కోసం చూస్తే దాన్ని రూ. 54,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్ ప్రాసెస్ ఈరోజు నుండే అమెజాన్ ఇండియా మరియు mi.com నుండి ప్రారంభమైంది.
మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనాలనుకుంటే, మీరు దీన్ని HDFC బ్యాంక్ యొక్క కార్డ్స్ ద్వారా రూ .3,000 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే, మీరు ఈ మొబైల్ ఫోన్ తో ఈ ఆఫర్‌ను అందుకోవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోన్ ను ముందస్తు ఆర్డర్ చేస్తే, మీకు Mi వైర్లెస్ ఛార్జర్ ను ఉచితంగా కూడా ఇస్తోంది. అయితే, మీరు గనుక రెడ్ జోన్ లో ఉంటే మాత్రం ఈ మొబైల్ ఫోన్ అందుకోలేరని
మీరు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇ-కామర్స్ సేవలు ఇప్పటికీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇది కాకుండా, ఈ షావోమి మి 10 మొబైల్ ఫోన్‌ను ట్విలైట్ గ్రే మరియు కోరల్ గ్రీన్ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల FHD + సూపర్ అమోలెడ్ ప్యానెల్ స్క్రీన్ తో వచ్చింది. ఇది గొరిల్లా గ్లాస్ 5 తో సేఫ్టితో ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో మీరు 90Hz అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను అందుకుంటారు. అధనంగా, ఈ మొబైల్ ఫోన్ కూడా HDR10 + ప్లేబ్యాక్ ధృవీకరనాటో వస్తుంది.
మీరు ఈ ఫోన్ డిస్ప్లేలో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పొందుతారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వేగవంతమైనటువంటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది మీకు 5 జి సపోర్ట్‌తో లభిస్తుంది, అంతేకాకుండా ఇది ఆక్టా-కోర్ CPU , అడ్రినో 650 GPUతో జత చేయబడింది. ఈ ఫోనులో మీరు 8GB తో పాటు 256GB వరకు UFS 3.0 స్టోరేజ్ అందుకుంటారు. అలాగే, ఏ ఫోన్ MIUI 11 ఆధారితమైన ఆండ్రాయిడ్ 10 OS తో లాంచ్ చేయబడింది.
ఈ ఫోన్ లోని కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, షావోమి మి 10 స్మార్ట్ ఫోన్ ఒక 108 MP ప్రధాన కెమెరాతో వస్తుంది. దీనికి తోడు ఈ ఫోనులో 13 MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరొక 2MP మాక్రో లెన్స్ తో పాటుగా 2MP డెప్త్ సెన్సార్ ఉంది. మీరు ఈ ఫోనులో 20MP ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతారు. ఈ సెల్ఫీ కెమెరాను పంచ్-హోల్ నోచ్ లో చూడవచ్చు .
ఈ ఫోన్ లో 4780 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 30W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది, దీనిలో మీరు వైర్డు మరియు వైర్లెస్ ఎంపికలను కూడా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ఫోనులో 5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌ను కూడా పొందవచ్చు. అలాగే, షావోమికూడా వైర్లెస్ ఛార్జర్ ను ప్రకటించింది మరియు దీని కోసం విడిగా రూ .2500 ధర చెల్లించాలి వుంటుంది.