xiaomi తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Xiaomi 11i గురించి రోజుకు ఒక ఫీచర్ ను వెల్లడిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చెయ్యడానికి జనవరి 6 తేదీని ఫిక్స్ చేసింది. ఈ Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 15 నిముషాల్లోనే 100% ఛార్జ్ చేసే 120W హైపర్ ఛార్జ్ ఫీచర్లతో తీసుకువస్తునట్లు ఈరోజు కొత్త ఫీచర్ గురించి రివీల్ చేసింది. ఇది మాత్రమే కాదు, లేటెస్ట్ ఫాస్ట్ మీడియాటెక్ Dimensity 920 ప్రోసెసర్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తునట్లు కూడా తన వైబ్సైట్ ద్వారా వెల్లడించింది.
జనవరి 6 న ఇండియాలో విడుదల'కానున్న ఈ షియోమి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Flipkart ప్రత్యేకంగా వస్తోంది మరియు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.
ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లేని కూడా ఇందులో అందించింది. అంతేకాదు, DOLBY ATMOS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు స్పెక్స్ లీక్ చేసింది.
ఈ ఫోన్ కలర్ అప్షన్ లతో పాటుగా వెనుక కెమెరా సెటప్ వివరాలను కూడా టీజింగ్ ఫొటో ద్వారా చూడవచ్చు. టీజింగ్ ద్వారా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కలిగి వుంది. ఇందులో 108 MP మైన్ కెమెరాని కంపెనీ నిర్ధారించింది. ఈ ఫోన్ పసిఫిక్ పెర్ల్ మరియు స్టెల్త్ బ్లాక్ మరియు క్యామో గ్రీన్ అనే మూడు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది.