Redmi 9 Prime : మంచి ఫీచర్లతో ఈరోజు విడుదల అవుతోంది

HIGHLIGHTS

రెడ్‌మి 9 ప్రైమ్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తన అధికారిక వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ నుండి ఆన్లైన్ వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ Redmi 9 Prime పూర్తి హెచ్‌డి + డిస్‌ప్లే తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

చాలా రోజులుగా షియోమీ టీజ్ చేస్తున్నటువంటి, రెడ్‌మి 9 ప్రైమ్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తన అధికారిక వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ నుండి  ఆన్లైన్ వర్చువల్ ఈవెంట్ ద్వారా  లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతేకాదు, ఈ  Redmi 9 Prime పూర్తి హెచ్‌డి + డిస్‌ప్లే తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది, ఈ విషయాన్ని గ్లోబల్ విపి మరియు షియోమి ఎండి మను కుమార్ జైన్ వెల్లడించారు. రెడ్‌మి 9 ప్రైమ్ సంస్థ యొక్క బడ్జెట్ విభాగంలో లేటెస్ట్ ఫోన్ ‌గా ఈరోజు భారతదేశంలో విడుదల కానుంది. వాటర్ ‌డ్రాప్ నాచ్‌తో ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు ఈ ఫోన్ టీజింగ్ వచ్చింది మరియు రెడ్‌మి 9 ప్రైమ్ గత నెల ప్రారంభంలో లాంచ్ చేసిన రెడ్‌మి 9 ను చాలా వరకూ పోలి ఉంటుంది.

Redmi Note 9 స్పెసిఫికేషన్

షియోమి రెడ్ మీ నోట్ 9 ఒక 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మరియు మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ Helio G 85 ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. అదే సమయంలో, ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ ‌లో పనిచేస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే, వినియోగదారులకు రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ ఫోన్ ‌లో క్వాడ్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ కోసం రెడ్ మీ నోట్ 9 లో 4 జి వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ వెర్షన్ 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్ ‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి పోర్ట్ టైప్-సి ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు ఈ రెడ్ మీ నోట్ 9 లో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుతారు, ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :