మార్కెట్లోకి వస్తున్న మరొక Redmi స్మార్ట్ ఫోన్…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

రెడ్‌మి తన మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది

మీడియాటెక్ హీలియో G88 చిప్ సెట్ తో వచ్చే మొదటి ఫోన్

షియోమి అప్ కమింగ్ ఫోన్ కొత్త ముచ్చట్లు

భారత మార్కెట్లోకి రెడ్‌మి తన మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. Redmi 10 Prime పేరుతో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చెయ్యడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 3వ తేది మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్లోకి మీడియాటెక్ హీలియో G88 చిప్ సెట్ తో వచ్చే మొదటి ఫోన్ అవుతుంది.

Redmi 10 Prime స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటికే Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన రెడ్‌మి 10 కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఈనెల ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో విడుదలైన Redmi 10 స్మార్ట్ ఫోన్ కావచ్చని కూడా  భావిస్తున్నారు.

రెడ్‌మి 10 : గ్లోబల్ వేరియంట్ స్పెక్స్

ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్పెక్స్ విషయానికి వస్తే, రెడ్‌మి 10 స్మార్ట్ ఫోన్  6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది రీడింగ్ మోడ్ 3.0 తోవస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన పనిచేస్తుంది.

కెమెరాలవిషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ కేమెరా సిస్టం మంచి డెప్త్ ఫోట్లను తెయ్యగలిగే శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.

రెడ్‌మి 10 ఫోన్లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 5,000 బిగ్ బ్యాటరీ మరియు రిటైల్ బాక్స్ లో 22.5W ఫాస్ట్ ఛార్జర్ కూడా అఫర్ చేస్తూంది. ఈ ఫోన్ 9W తో రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు మరియు AI ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

రెడ్‌మి 10: ప్రైస్

రెడ్‌మి 10 గ్లోబల్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ 179 పౌండ్స్( సుమారు 13,300) ధరతో, 4GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ 199 పౌండ్స్( సుమారు 14,800) ధరతో, 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ 219 పౌండ్స్( సుమారు 16,300) ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :