షియోమి Redmi K40 సిరీస్ స్పీడ్ చూడతరమా…!

Updated on 26-Feb-2021
HIGHLIGHTS

రెడ్‌మి కె40 సిరీస్ నుంచి 3 ఫోన్లు లాంచ్

రెడ్‌మి కె40, కె40 ప్రో మరియు కె40 ప్రో ప్లస్ లాంచ్

షియోమి తన రెడ్‌మి కె40 సిరీస్ నుండి మూడు స్మార్ట్‌ఫోన్ లను చైనాలో లాంచ్ చేసింది. ఈ రెడ్‌మి కె40 సిరీస్ నుంచి రెడ్‌మి కె40, రెడ్‌మి కె40 ప్రో మరియు రెడ్‌మి కె40 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రొసెసర్, వెనుక గొప్ప కెమెరా సెటప్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో విడుదల చేసింది.

షియోమి చైనాలో లాంచ్ చేసిన ఈ రెడ్‌మి కె40 సిరీస్ ఫోన్లను చాలా సన్నగా కేవలం 7.8 మిల్లి మీటర్ల మందంతో తీసుకొచ్చింది. ఈ రెడ్‌మి కె40 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లో HDR 10+ సర్టిఫికెట్ మరియు 120Hz హై రిఫ్రెష్ రేట్ కలిగిన ఒక 6.67అంగుళాల FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని అందించింది. అంటే, కంటెంట్ ను మంచి క్లారిటీ తో పాటుగా క్లియర్ గా చూడవచ్చు.

ఇక ఈ రెడ్‌మి కె40 సిరీస్ ప్రోసెసర్ల విషయానికి వస్తే, రెడ్‌మి కె40 ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ తో, రెడ్‌మి కె40 ప్రో మరియు కె40 ప్రో+ మాత్రం స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ శక్తితో పనిచేస్తాయి మరియు 12GB ర్యామ్ మరియు 256 UFS 3.1 వరకూ స్టోరేజ్ తో వస్తుంది. కెమెరాల పరంగా రెడ్‌మి కె40 ప్రో + 108 ఎంపీ కెమెరాతో, రెడ్‌మి కె40 ప్రో 64 ఎంపీ మైన కెమెరాతో వస్తాయి మరియు సెల్ఫీ కెమెరాని పంచ్ హోల్ లో కలిగి వుంటాయి. అలాగే, రెడ్‌మి కె40 ప్రో మరియు ప్రో ప్లస్ రెండు కూడా 4,520 బ్యాటరీతో ,మరియు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టి వస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :