Redmi Note 11s: 108ఎంపి కెమెరా మరియు 90Hz AMOLED డిస్ప్లేతో వస్తోంది

Updated on 04-Feb-2022
HIGHLIGHTS

Redmi Note 11s యొక్క కీలకమైన స్పెసిఫికేషన్ల వెల్లడి

90Hz AMOLED డిస్ప్లే

Xiaomi ఇండియాలో ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన Redmi Note 11s స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫిబ్రవరి 9న జరగనున్న ఈవెంట్ ద్వారా మల్టీ ప్రోడక్ట్స్ లాంచ్ ను షియోమి ప్లాన్ చేసింది. ఈవెంట్ ద్వారా స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేయనున్నది. అయితే, రెడ్ మీ నోట్ 11s యొక్క కీలకమైన ఫీచర్లతో కంపెనీ టీజింగ్ చేస్తోంది.

షియోమి వెబ్సైట్ నుండి అందించిన Redmi Note 11s టీజింగ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ కి జతగా ఒక LED ఫ్లాష్ ను కూడా కలిగివుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. అలాగే, ఈ ఫోన్ 90Hz AMOLED డిస్ప్లే మరియు 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 11GB వరకూ RAM బూస్టింగ్ టెక్నలాజి కూడా ఉన్నట్లు టీజర్ లో చూపించింది.    

ఇక ముందుగా వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ అంచనా ధరలను కూడా చూడవచ్చు. అందులో, Xiaomi Note 11 స్టార్టింగ్ వేరియంట్ రూ.13,999 నుండి రూ.14,499 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, Redmi Note 11S భారతదేశంలో రూ.16,999 లేదా రూ.17,499 నుండి ప్రారంభమవుతుంది.

ఇక Redmi Note 11 అంచనా ఫీచర్ల విషయానికి వస్తే, ఇది కూడా 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ సెట్  జతగా LPDDR4x RAM కలిగి వుండవచ్చు. కెమెరా సెటప్ పరంగా, 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి + 2ఎంపి   క్వాడ్-కెమెరా సెటప్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాని కలిగి వుండవచ్చని భావిస్తున్నారు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :