Xiaomi 13 Series: అప్ కమింగ్ ఫోన్ల లాంచ్ డేట్స్ ప్రకటించిన షియోమీ.!

HIGHLIGHTS

Xiaomi 13 Series స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది

Xiaomi 13 డిజైన్‌ను తెలియచేసే విదంగా రెండు పోస్టర్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది

Xiaomi 13 మరియు 13 Pro ఒకే విధమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి

షియోమీ తన అప్ కమింగ్ Xiaomi 13 Series స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. గతకొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న Weibo ఈ కొత్త న్యూస్ ను తీసుకొచ్చింది. Xiaomi 13 Series స్మార్ట్ ఫోన్ లను డిసెంబర్ 11న షియోమీ చైనాలో లాంచ్ చేయనునట్లు వీబో తెలిపింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల తేదీని ధృవీకరించడమే కాకుండా, Xiaomi 13 డిజైన్‌ను తెలియచేసే విదంగా రెండు పోస్టర్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది.

Xiaomi 13 Series

Xiaomi 13 మరియు 13 Pro ఒకే విధమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే, Pro మోడల్ Xiaomi 13 సిరీస్ యొక్క హైఎండ్ వెర్షన్ అని కొత్త నివేదికలు తెలిపాయి. Xiaomi 13 పంచ్-హోల్ డిజైన్‌తో ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెండింటిని పోల్చి చూస్తే, ప్రో మోడల్ కర్వ్డ్ అంచులతో పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు, Xiaomi 13 చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ కెమెరాలు, డ్యూయల్-LED ఫ్లాష్ మరియు Leica  బ్రాండింగ్ కలిగి ఉంది. Xiaomi 13 పదునైన మూలలతో కూడిన ఫ్లాట్-ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్.

ఇక Xiaomi 13 లో పరిశీలన స్పెక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.36-అంగుళాల E6 AMOLED FHD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఇది  Snapdragon 8 Gen 2 పవర్డ్ స్మార్ట్‌ఫోన్. జతగా, 12GB వరకు LPDDR5x RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగంలో, Xiaomi 13 ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :