Xiaomi 17 Ultra : షియోమీ ప్రీమియం ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

Updated on 23-Feb-2026
HIGHLIGHTS

Xiaomi 17 Ultra ఫోన్ ను గ్లోబల్ లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది

MWC 2026 నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుందని చెబుతున్నారు

ఈ అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ ను కంపెనీ టీజర్ రూపంలో అందించింది

ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ షియోమీ తన అప్ కమింగ్ ఫ్లాగ్‌ షిప్ సిరీస్‌ షియోమీ 17 నుండి Xiaomi 17 Ultra ఫోన్ ను గ్లోబల్ లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. బార్సిలోనా లో నిర్వహించబడుతున్న MWC 2026 నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, గ్లోబల్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం షియోమీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Xiaomi 17 Ultra : లాంచ్ డేట్?

షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను భారతీయ కాలమానం ప్రకారం 2026 ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ గ్లోబల్ ఈవెంట్ స్పెయిన్ లో (MWC Barcelona) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.

Also Read: కేవలం ఇయర్ బడ్స్ ధరలోనే Dolby Audio సౌండ్ బార్ పొందండి.!

Xiaomi 17 Ultra : ఫీచర్స్

ఈ అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ ను కంపెనీ టీజర్ రూపంలో అందించింది. ఈ ఫోన్ పెద్ద సైజులో ఉన్నట్లు ఇమేజ్ చూసే వారికి అర్థం అవుతుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో వెనుక మాట్టే ఫినిష్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో అద్భుతమైన రియర్ కెమెరా సిస్టం ఉన్నట్లు షియోమీ తెలిపింది.

కెమెరా పరంగా, ఈ షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వెనుక పెద్ద రౌండ్ కెమెరా బంప్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద 1 ఇంచ్ Leica అల్ట్రా డైనమిక్ 50MP మెయిన్ కెమెరా జతగా Leica 200MP టెలిఫోటో ఉంటుంది. అంతేకాదు, ఇందులో 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన ఆప్టికల్ సిస్టం తో మొబైల్ నైట్ ఫోటోగ్రఫీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని షియోమీ ఈ ఫోన్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :