Xiaomi 13 Pro 5G: షియోమి ప్రమియం Leica కెమేరా ఫోన్ వచ్చేసింది.!

HIGHLIGHTS

Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ కెమేరా తయారీ కంపెనీ Leica యొక్క భాగస్వామ్యంతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ వెనుక Leica బ్రాండింగ్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది

షియోమి ఈరోజు తన Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ కెమేరా తయారీ కంపెనీ Leica యొక్క భాగస్వామ్యంతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వెనుక Leica బ్రాండింగ్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేవలం కెమేరా మాత్రమే కాదు, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ఫాస్ట్ షిప్ సెట్, ఫాస్ట్ ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ఈ షియోమి ప్రమియం Leica కెమేరా ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా. 

Xiaomi 13 Pro 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు

Xiaomi 13 Pro 5G ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా షియోమి ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ E6 AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణని ఈ ఫోన్ లో జతచేసింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen2 SoC తో పనిచేస్తుంది. అంతేకాదు, ఇది LPDDR5X 12GB RAM మరియు UFS 4.0 256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ షియోమి ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX989) కెమెరాకి జతగా 3.2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమేరా సిస్టం Leica కెమేరా పనితనం తో నిర్మించబడింది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 4,820mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ మరియు 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ లను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా కలిగి ఉంది. 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను ముందుగా అందించిన కంపెనీ, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర వివరాలు రేపు తెలియ చేయబడతాయి.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :