షియోమీ 12S అల్ట్రా ఫోన్ ని భారీ ఫీచర్లతో లాంచ్ చేసిన షియోమీ..!!
షియోమీ 12S అల్ట్రా ఫోన్ ని భారీ ఫీచర్లతో షియోమీ లాంచ్ చేసింది
ఈ ఫోన్ లో పెద్ద 1 ఇంచ్ Sony సెన్సార్ మరియు Leica ఆప్టిక్స్ అందించింది
Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
గత కొంత కాలంగా లీక్స్ మరియు రూమర్లతో ఆన్లైన్లో మోత మోగించిన షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఎట్టకేలకు ఈరోజు చైనాలో విడుదల చేసింది. షియోమీ ఈరోజు చైనాలో షియోమీ 12S అల్ట్రా తో పాటుగా షియోమీ 12S మరియు షియోమీ 12S ప్రో వేరియంట్ లను కూడా విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లలో కూడా షియోమీ 12S అల్ట్రా ఫోన్ ని భారీ ఫీచర్లతో షియోమీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో పెద్ద 1 ఇంచ్ Sony సెన్సార్ ని ఇవ్వడమే కాకుండా క్వాలిటీ ఫోటల కోసం ప్రముఖ ఇమేజింగ్ కంపెనీ Leica తో కూడా జత కలిసింది. ఇలా చెప్పుకుంటూ పొతే, ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, ప్రాసెసర్ నుండి మొదలుకొని కెమెరా మరియు బ్యాటరీ వరకూ అన్ని వివరాల్లో కూడా ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది. మరింకెందుకు ఆలశ్యం షియోమీ 12S అల్ట్రా పూర్తి వివరాలను తెలుసుకుందామా.
Surveyషియోమీ 12S అల్ట్రా : స్పెక్స్
షియోమి 12S అల్ట్రా 10-bit 6.73-అంగుళాల E5 AMOLED డిస్ప్లేని QHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 512GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.
షియోమీ 12S అల్ట్రా Sony 1ఇంక్ బిగ్ సెన్సార్ 50MP (IMX989) కెమెరాకి జతగా 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 48MP 120mm 5x పెరిస్కోప్ జూమ్ మరియు 3D ToF డెప్త్ సెన్సార్ ను కలిగివుంది. క్వాలిటీ ఫోటల కోసం ప్రముఖ ఇమేజింగ్ కంపెనీ Leica తో కూడా జత కలిసింది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా విభాగంలో, మీరు Leica లెన్స్, Leica ఫిల్టర్‌లు, Dolby Vision మరియు HyperOIS వంటి ఫీచర్లను పొందుతారు.
షియోమీ 12S అల్ట్రా స్మార్ట్ ఫోన్ 4,860mAh బ్యాటరీని 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ తో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్, USB-C 2.0, WiFi 6e, బ్లూటూత్ 5.2, NavIC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ సేఫ్టీ కూడా పొందుతారు.
షియోమీ 12S అల్ట్రా : ధర
షియోమీ 12S అల్ట్రా ధర విషయానికి వస్తే, చైనాలో 8/256GB వేరియంట్ ను CNY 5,999 (సుమారు రూ.70,829) ధరతో ప్రకటించింది, 12GB /256GB మోడల్ ధర CNY 6,499 (సుమారు రూ.76,732), మరియు 12GB /512GB మోడల్ CNY 6999 (సుమారు రూ.82,61) ధరతో లాంచ్ చేసింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile