Xiaomi 12 Ultra: విడుదలకు ముందే లీకైన స్పెక్స్.. ఎలా ఉందంటే.!

Updated on 27-Jun-2022
HIGHLIGHTS

Xiaomi 12 Ultra యొక్క స్పెక్స్ విడుదలకు ముందే లీకయ్యాయి

ఈ స్మార్ట్ ఫోన్ భారీ మరియు హై ఎండ్ ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు కనిపిస్తోంది

MIUI 13 సాఫ్ట్‌వేర్ మరియు 120W ఛార్జింగ్ సపోర్ట్

షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Xiaomi 12 Ultra యొక్క స్పెక్స్ విడుదలకు ముందే లీకయ్యాయి. ఈ లీకైన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ భారీ మరియు హై ఎండ్ ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు కనిపిస్తోంది. జులై 5 న చైనాలో విడుదలకు సిద్దమౌతున్నఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి (Trak.in) సూచించిన రూమర్స్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఈ షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 సాఫ్ట్‌వేర్ మరియు 120W ఛార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్‌ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రూమర్స్ మరియు లీక్స్ ద్వారా ఈ 12 అల్ట్రా అంచనా స్పెక్స్ క్రింద అందించాము.

Xiaomi 12 అల్ట్రా స్పెక్స్ మరియు ఫీచర్లు (అంచనా)

లీకైన వివరాల ద్వారా, షియోమీ 12 అల్ట్రా పెద్ద 6.6-అంగుళాల కర్వ్డ్ డిస్ప్లేని AMOLED ప్యానెల్‌తో మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకురావచ్చు. అలాగే, ఈ డిస్ప్లే పెద్ద పంచ్ హోల్‌తో డిజైన్ తో రావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ దాని కెమెరాల పరంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, వెనుక భాగంలో ఈ ఫోన్ 50MP Sony IMX989 ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు రెండు పెరిస్కోప్ జూమ్ కెమెరా లెన్స్‌ లతో కూడిన కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళితే, షియోమీ 12 అల్ట్రా ఫోన్ క్వాల్కమ్ యొక్క వేగవంతమైన ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో పాటుగా 12GB వరకు RAM మరియు 512GB వరకూ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 సాఫ్ట్‌వేర్ తో అందించే అవకాశం వుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :