Xiaomi 12 Pro పైన భారీ అఫర్ అందుకోండి..!!

HIGHLIGHTS

Xiaomi 12 Pro పైన అమెజాన్ మంచి ఆఫర్లు అందించింది

ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్ తో కొనేవారికి 56,000 ధరకే లభిస్తుంది

EMI అప్షన్ తో కొనేవారికి 6,000 రూపాయల డిస్కౌంట్

షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Xiaomi 12 Pro పైన అమెజాన్ మంచి ఆఫర్లు అందించింది. ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 8K వీడియో లను చిత్రీకరించ గల ట్రిపుల్ 50MP కెమెరాలు వంటి భారీ ప్రత్యేకతలను కలిగి వుంది. ఈ ఫోన్ ప్రీమియం ధరలో వచ్చినా డబ్బుకు తగిన విలువను అందించే ఫీచర్లను కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ లేటెస్ట్ షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ యొక్క ఆఫర్లు, ధర మరియు మరిన్ని వివరాల గురించి క్రింద చూడవచ్చు.

Xiaomi 12 Pro: ధర

షియోమీ 12 ప్రో యొక్క బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 62,000 ధరతో వచ్చింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 6,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్ తో కొనేవారికి 56,000 ధరకే లభిస్తుంది.  Buy From Here 

Xiaomi 12 Pro: స్పెక్స్

షియోమి 12 ప్రో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు  

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :