Xiaomi 12 ఫోన్ లో భారీ 100W ఛార్జింగ్ సపోర్ట్

Updated on 10-Nov-2021
HIGHLIGHTS

షియోమి యొక్క అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Xiaomi 12

Snapdragon 898 ప్రోసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు

100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కూడా తెలుస్తోంది

షియోమి యొక్క అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Xiaomi 12 ఈ సంవత్సరం చివరికల్లా లాంచ్ అవుతుందని రూమర్. ఈ ఫోన్ Snapdragon Tech Summit సందర్భంగా ప్రకటించవచ్చని ఊహిస్తున్న Snapdragon 898 ప్రోసెసర్ తో  వస్తుందని భావిస్తున్నారు. ఈ స్నాప్ డ్రాగన్ టెక్ సమ్మిట్ నవంబర్ 30 న జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, కొత్తగా ఇంటర్నెట్ లో వచ్చిన ఆన్లైన్ లీక్స్ ఈ ఫోన్ గురించి చాలా విషయాలను వెల్లడిస్తున్నాయి.

లేటెస్ట్ లీక్ ప్రకారం, షియోమి అప్ కమింగ్ ఫోన్ Xiaomi 12 అత్యంత వేగంగా పనిచేయ్యగల 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని  మరియు కొత్త మరియు మెరుగైన 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉందని చెబుతున్నాయి.

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Xiaomi 12 కేవలం సాధారణ వేరియంట్ మరియు ఇందులో పెరిస్కోప్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ లను కలిగి ఉండదు. అయితే, ఇందులో లేటెస్ట్ మరియు మెరుగైన 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని మరియు అత్యంత వేగంగా పనిచేయ్యగల 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కూడా చెబుతోంది.

షియోమి గత సంవత్సరం స్నాప్ డ్రాగన్ 888 SoC మరియు భారీ ఫీచర్లతో Mi 11 ను మార్కెట్లోకి తీసుకొచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సంవత్సరం తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  Xiaomi 12 లాంచ్‌తో దానిని పునరావృతం చేయాలని చూస్తోంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :