Xiaomi 11T Pro: ఇండియాలో విడుదలకు సిద్ధమైన మరొక హైపర్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ ను జనవరి 19న విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది

120W ఫాస్ట్ ఛార్జింగ్

అమెజాన్ ప్రత్యేకంగా వస్తోంది

ఇండియాలో మరొక స్మార్ట్ ఫోన్ ను అదికూడా Xiaomi 11 సిరీస్ నుండి విడుదల చేయనున్నట్లు షియోమి ప్రకటించింది. 11 సిరీస్ నుండి Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ ను జనవరి 19న ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్లతో తీసుకువస్తునట్లు కూడా కంపెనీ చెబుతోంది. ఇటీవల ఇండియాలో ఆవిష్కరించిన Xiaomi 11 హైపర్ ఛార్జ్ 5G మాదిరిగానే ఇందులో కూడా 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించనట్లు టీజింగ్ మొదలుపెట్టింది.

ఈ అప్ కమింగ్ షియోమి స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రత్యేకంగా వస్తోంది. ఎందుకంటే, అమెజాన్ ఇప్పటికే ఈ ఫోన్ గురించి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది మరియు ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 108MP ట్రిపుల్ కెమెరా మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ అధికారికంగా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చెయ్యబడింది. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ స్పెక్స్ క్రింద చూడవచ్చు.

Xiaomi 11T Pro: ఎక్స్ పెక్స్టెడ్ స్పెక్స్

షియోమి 11T ప్రో దాదాపుగా గ్లోబల్ వేరియంట్ ఆధారితంగా ఉంటుంది. ఇది 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు MIUI 12 యొక్క తాజా వెర్షన్‌లో రన్ అవుతుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 8K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లను అందించింది. షియోమి 11T ప్రో స్మార్ట్ ఫోన్ 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :