Xiaomi 11i: కేవలం 15 నిముషాల్లోనే 100% ఛార్జ్ చేసే ఫీచర్ తో వస్తోంది

HIGHLIGHTS

Xiaomi 11i లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే

DOLBY ATMOS సౌండ్ టెక్నలాజి సపోర్ట్

xiaomi తన 11 సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ Xiaomi 11i ను ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. అయితే,   ఇప్పటికే ఈ సిరీస్ నుండి 5 స్మార్ట్ ఫోన్లను అందించిన షియోమి ఇప్పుడు మరొక కొత్త స్మార్ట్ ఫోన్ కూడా తీసుకురావడం విశేషం. ఇది మాత్రమే కాదు, ఈ Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్ కేవలం 15 నిముషాల్లోనే 100% ఛార్జ్ చేసే భారీ ఫీచర్లతో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.

ఈ ఫోన్ ను జనవరి 6 న ఇండియాలో లాంచ్ చేయనుంది మరియు ఇందులో భారీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువస్తున్నట్లు టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ Flipkart ప్రత్యేకంగా తీసుకువస్తోంది మరియు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది.

ఇక ఈ ఫోన్ గురించి టీజ్ చేస్తున్న మరిన్ని విషయాలను చూస్తే, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లేని కూడా ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, DOLBY ATMOS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు స్పెక్స్ లీక్ చేసింది.

ఈ ఫోన్ కలర్ అప్షన్ లతో పాటుగా వెనుక కెమెరా సెటప్ వివరాలను కూడా టీజింగ్ ఫొటో ద్వారా చూడవచ్చు. టీజింగ్ ద్వారా,  ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కలిగి వుంది. ఇందులో 108 MP మైన్ కెమెరాని కంపెనీ నిర్ధారించింది. ఈ ఫోన్ పసిఫిక్ పెర్ల్ మరియు స్టెల్త్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఇంకా మరికొన్ని ఫీచర్లను విడుదల కంటే ముందుగానే షియోమి వెల్లడించనుంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :