భారీ ఫీచర్లతో మరో రెండురోజుల్లో విడుదలకానున్న Xiaomi 11i స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

జనవరి 6న ఇండియాలో విడుదలకానున్న Xiaomi 11i

అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్

xiaomi లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Xiaomi 11i ను జనవరి 6 తేదీకి ఇండియాలో విడుదల చేయనుంది. ఈ అప్ కమింగ్ షియోమి స్మార్ట్ ఫోన్  మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ మరియు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువస్తునట్టు వెల్లడించింది. ఈ ఫోన్ ఎంత స్పీడ్ గా ఈ ఫోన్ ను ఛార్జింగ్ చేస్తుందంటే, కేవలం 15 నిముషాల్లోనే ఫోన్ ను 100% ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

జనవరి 6 న ఇండియాలో విడుదల'కానున్న ఈ షియోమి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Flipkart ప్రత్యేకంగా వస్తోంది మరియు ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ముఖ్యంగా, ఈ ఫోన్ అందించిన 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్  గురించి షియోమి టీజ్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, లేటెస్ట్ ఫాస్ట్ మీడియాటెక్ Dimensity 920 ప్రోసెసర్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తునట్లు కూడా ఈ ఫోన్ స్పెక్స్ టీజింగ్ ద్వారా వెల్లడించింది.  

ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లేని కూడా ఇందులో అందించింది. అంతేకాదు, DOLBY ATMOS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు స్పెక్స్ లీక్ చేసింది.

ఈ ఫోన్ కలర్ అప్షన్ లతో పాటుగా వెనుక కెమెరా సెటప్ వివరాలను కూడా టీజింగ్ ఫొటో ద్వారా చూడవచ్చు. టీజింగ్ ద్వారా,  ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కలిగి వుంది. ఇందులో 108 MP మైన్ కెమెరాని కంపెనీ నిర్ధారించింది. ఈ ఫోన్ పసిఫిక్ పెర్ల్ మరియు స్టెల్త్ బ్లాక్ మరియు క్యామో గ్రీన్ అనే మూడు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :