షియోమి లేటెస్ట్ గా ఇండియాలో ప్రకటించిన Xiaomi 11i సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మొదటి సేల్ రేపు జరగనుంది. Xiaomi 11i 5G సిరీస్ నుండి వచ్చిన Xiaomi 11i మరియు 11i Hyper Charge 5G రెండు ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఫోన్లు దాదాపుగా ఒకేవిధమైన స్పెక్స్ తో ఉన్నా, 11i హైపర్ ఛార్జ్ స్మార్ట్ ఫోన్ అత్యంత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఎంత వేగం అంటే, కేవలం 15 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జింగ్ అయిపోతుంది.
షియోమి 11i 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB RAM /128GB స్టోరేజ్‌తో రూ.24,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. 8GB RAM /128GB స్టోరేజ్‌వేరియంట్ ధర రూ.26,999. అలాగే షియోమి 11i హైపర్ ఛార్జ్ 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB RAM /128GB స్టోరేజ్‌తో రూ.26,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. 8GB RAM /128GB స్టోరేజ్‌వేరియంట్ ధర రూ.28,999. ఈ స్మార్ట్ ఫోన్స్ జనవరి 12 నుండి Flipkart, Mi స్టోర్ యాప్ మరియు మరిన్నింటిలో అందుబాటులో ఉంటుంది. Flipkart ఈ ఫోన్ల మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా IP53 రేటింగ్ కలిగిన గ్లాస్ బాడీని కలిగి ఉంటాయి. ఈ రుండు ఫోన్లు కూడా 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పాటుగా 1200 నిట్స్ గరిష్ఠ బ్రెట్నెస్ అందిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ లేటెస్ట్ 5G 6nm ప్రోసెసర్ Dimensity 920 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8జిబి ర్యం మరియు 128జిబి స్టోరేజ్ లను కలిగివుంది.
కెమెరా సెట్టింగ్స్ గురించి చూస్తే, ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 4K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ చెబుతోంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
ఇక ఈ రెండు ఫోన్లలో గమనించదగిన వ్యత్యాసం బ్యాటరీ ఫీచర్. Xiaomi 11i 5G ఫోన్ 67W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,160mAh బ్యాటరీతో వస్తే, 11i Hyper Charge 5G మాత్రం 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, షియోమి ఈ రెండు ఫోన్లకు తగిన ఫాస్ట్ చార్జర్లను బాక్స్ తోపాటుగా అందిస్తుంది.
ఇక అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు మరియు Dolby Atmos సర్టిఫికేషన్ మరియు Hi-Res ఆడియో ప్లేబ్యాక్ సపోర్ట్‌తో వస్తాయి.