Redmi లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ తగ్గింపు ప్రకటించిన షియోమి.!

HIGHLIGHTS

Redmi లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన భారీ ప్రైస్ కట్

ఈ తగ్గింపు తరువాత ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది

ఈ పవర్ ఫుల్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకే లభిస్తోంది

Redmi ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన భారీ ప్రైస్ కట్ ను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఈ తగ్గింపు తరువాత ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. మనం మాట్లడుకుంటోంది రెడ్ మి లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చిన Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ గురించి. ఈ పవర్ ఫుల్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లేటెస్ట్ ధర మరియు స్పెక్స్ తెలుసుకోండి.            

Redmi 11 Prime 5G: ప్రైస్ కట్ మరియు ధర

రెడ్ మి ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.13,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ పైన 1,000 రూపాయల భారీ ప్రైస్ కట్ ను ప్రకటించడం ద్వారా తక్కువధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ (4GB+64GB) రూ.12,999 ధరతో లభిస్తోంది మరియు (6GB+128GB) వేరియంట్ రూ.14,999 ధరతో లభిస్తోంది.               

Redmi 11 Prime 5G: స్పెక్స్

రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్  రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/4GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, FM రేడియో తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :