వోడాఫోన్ కోత రూ.129 ప్రీపెయిడ్ ప్లానుతో, డైలీ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
ఈ ప్రీపెయిడ్ ప్లాను 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
వోడాఫోన్, ఇప్పుడు సరికొత్తగా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఈ ప్లానుతో, చాల గొప్ప లాభాలను అందుకుంటారు వోడాఫోన్ వినియోగదారులు. ఈ రూ.129 ప్రీపెయిడ్ ప్లానుతో, ప్రతి ఒక్కరూ ప్రస్తుతం టెలికాం ల నుండి కోరుకునే విధంగా, రోజువారీ 1.5GB దాటని అందిస్తుంది. అలాగే, ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
Surveyరూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ రూ.129 ప్రీపెయిడ్ ప్లానుతో ఎటువంటి FUP పరిమితి లేనటువంటి లోకల్ మరియు STD అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. పైన తెలిపిన విధంగా, రోజువారీ 1.5 డేటా మరియు 28 రోజుల వ్యాలిడిటీకి గాను 2,800 sms లను కూడా అందిస్తోంది.అయితే,ఇక్కడ తెలిపిం 2,800 sms లు రోజుకు 100 sms పరిమితితో అందుతాయి.
ఆయితే, ఈ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం గుజరాత్, చెన్నై మరియు మరికొన్ని ఎంచబడిన కొన్ని వోడాఫోన్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో వుంది. కానీ, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను త్వరలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సహా అన్ని ప్రధాన సర్కిళ్లలో అందుబాటులోకి తెస్తుందని అంచనా వస్తున్నారు.
అలాగే , ఇటీవలి కాలంలో వోడాఫోన్ యొక్క ఈ మరొక రూ. 509 ప్రీపెయిడ్ ప్లానుపైన కూడా మార్పులు చేసింది ఎటువంటి FUP పరిమితిలేని లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్,రోజువారీ 1.4GB డేటా మరియు రోజువారీ 100SMS పరిమితితో పాటుగా 90 రోజుల వ్యాలిడిటీతో అందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించి, వినియోగదారులకి రోజువారీ 100MB డేటాని అధికంగా అఫర్ చేస్తోంది. అంటే, ఇప్పుడు ఈ ప్లానుతో రోజువారీ 1.5GB డేటాని అందుకుంటారు వినియోగదారులు.
ఇక పూర్తి వ్యాలిడిటీ అయినటువంటి 90 రోజులకు గాను లెక్కగడితే, 9GB డేటా ప్రయోజనాన్ని వినియోగదారులు అధికంగా అందుకుంటారు. అలాగే, ఉచిత LIVE టీవీ కి యాక్సెస్ అందుకుంటారు మరియు ఇంకా మరిన్ని ప్రయోజనాలను ఈ 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో అందుకుంటారు. కానీ, వోడాఫోన్ యొక్క రూ. 511 ప్లాను దీనికి పోటీకి వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే, రూ. 511 ప్రీపెయిడ్ ప్లానుతో అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100SMS లతో పాటుగా రోజువారీ 2GB డేటాని అఫర్ చేస్తోంది. అయితే, వ్యాలిడిటీ మాత్రమే 84 రోజులుగా ఉంటుంది.
అయితే, ముందుగా ఇంచుమించు ఇటువంటి ప్రయోజనాలతో రూ. 119 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వోడాఫోన్ అందించింది. ఈ ప్లానుతో అన్లిమిటేడ్ కాలింగ్ మరియు రోజువారీ 1GB డేటా తో పాటుగా 28 రోజుల చెల్లుబాటుతో అందించింది. అంతేకాకుండా, రోజువారీ 100sms పరిమితితో పూర్తి చల్లుబాటు కాలానికి ఈ ప్రయోజనాన్ని వర్తింపచేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile