భారతీయ టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi ) తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా (Vi ) కూడా ప్రీపెయిడ్ ప్లాన్స్ టారిఫ్ రేట్లను పంచుతున్నట్లు ప్రకటించింది. ముందుగా, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క రీఛార్జ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన ఒకరోజు తరువాత వోడాఫోన్ ఐడియా (Vi ) కూడా ఇదే దారిలో టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.
లేటెస్ట్ గా ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన టారిఫ్ రేట్లను 25 శాతం వరకు పెంచింది మరియు వోడాఫోన్ ఐడియా (Vi ) కూడా ఇదే విధమైన నిర్ణయాన్ని తీసుకుంది. వోడాఫోన్ ఐడియా (Vi ) యొక్క కొత్త టారిఫ్ రేట్స్ నవంబర్ 25 నుండి అమలులోకి వస్తాయి.
నవంబర్ 25 నుండి వోడాఫోన్ ఐడియా (Vi ) యొక్క పెరిగిన టారిఫ్ లు అమలులోకి వస్తే రీఛార్జ్ ల పైన అధికంగా చెలించవలసి వస్తుంది. అంటే, వోడాఫోన్ ఐడియా (Vi ) యొక్క 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం 79 రూపాయల ప్రారంభ ధరలో వస్తుండగా, రేపటి నుండి 99 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
ఇక బడ్జెట్ వినియోగదారులకు ప్రీతిపాత్రమైన 149 అన్లిమిటెడ్ ప్లాన్ రీఛార్జ్ కోసం 179 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే, 56 రోజుల ప్లాన్ రూ.449 ప్లాన్ కోసం రూ.539, రూ.379 రూపాయల క్వార్ట్రర్లి ప్లాన్ (84 రోజుల) కోసం రూ.459 చెల్లించాల్సి వస్తుంది. ఇక సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీ ప్లాన్ కోసం అయితే ఏకంగా 501 రూపాయలు అధనంగా పే చేయవలసి వస్తుంది.
ఈరోజు వోడాఫోన్ ఐడియా (Vi ) వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్ రూ.2,399 రూపాయలతో వస్తుండగా, రేపటి నుండి ఈ ప్లాన్ కోసం రూ.2,899 మొత్తాన్ని చెల్లించాలి. రేపటి నుండి వోడాఫోన్ ఐడియా (Vi ) యొక్క ఈ కొత్త టారిఫ్ రేట్స్ అమలులోకి వస్తాయి. ఇక మిగిలింది జియో మాత్రమే. అయితే, జియో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడం గురించి మాట్లాడలేదు. కానీ, త్వరలోనే జియో కూడా రేట్స్ పెంచవచ్చని ఊహిస్తున్నారు.
ఎవోడాఫోన్ ఐడియా (Vi ) బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.