ఇటివల, వివో సంస్థ ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్, VIVO U20 యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను, మంచి ప్రత్యేకతలతో కేవలం రూ.10,990 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు జరగనున్న మరొక ఫ్లాష్ సేల్ నుండి కూడా 9,990 రూపాయల ధరకే కొనేలా మరొక అవకాశాన్ని ఇప్పుడు అందించింది.ఈరోజు జరగనున్న ఫ్లాష్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్‌ను ICICI క్రెడిట్ లేదా క్రెడిట్ /డెబిట్ EMI ఎంపికలతో కొనేవారికి 1,000 రుపాయల నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, ఈ ఫోన్‌ను కేవలం రూ. 9,990 రూపాయల ధరకే కొనవచ్చు.
ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.
కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా 2 MP మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.