Vivo Y75: 44MP సెల్ఫీ కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ తో వచ్చింది..!!

Updated on 23-May-2022
HIGHLIGHTS

వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo Y75 ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది

44MP సెల్ఫీ కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది

8GB + 128GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో విడుదల చేసింది

వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo Y75 ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం ఒకే ఒక వేరియంట్ తో వివో ప్రకటించింది. అయితే, ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 44MP సెల్ఫీ కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. భారతీయ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, అఫర్ మరియు పూర్తి వివరాలను పరిశీలిద్దాం.  

Vivo Y75: ధర

వివో వై75 సార్ట్ ఫోన్ ను కేవలం 8GB + 128GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో విడుదల చేసింది మరియు దీని ధర రూ.20,999. ఈ వివో లేటెస్ట్ ఫోన్  Flipkart, Vivo ఇండియా ఇ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ నుండి అందుబాటులో వుంది.  

Vivo Y75: స్పెక్స్

Vivo Y75 (4G) స్మార్ట్ ఫోన్ 6.44 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఇది సాధారణ 60Hz రిఫ్రెష్ రేట్ వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో  వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి వుంది.

ఇక కెమెరాల విభాగంలో, వివో వై75 ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా వుంది మరియు ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP వైడ్ యాంగిల్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ సెల్ఫీల కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే, ముందుభాగంలో 44MP AF సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,050mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :