Vivo Y75 5G: 50MP ట్రిపుల్ కెమెరా, Extended RAM 2.0 టెక్నాలజీతో వచ్చింది

Updated on 28-Jan-2022
HIGHLIGHTS

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, Dimensity 700 5G ప్రాసెసర్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో కొత్త ఎక్స్ టెండేడ్ RAM 2.0 టెక్నాలజీని కూడా అందించింది. కొత్త వచ్చిన ఈ వివో 5G ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకుందమా.

Vivo Y75 5G: ధర

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ రూ.21,990 ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ గ్లోయింగ్ గెలాక్సీ మరియు స్టార్‌లైట్ బ్లాక్ కలర్‌ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ ల నుండి కొనుగోలు చేయవచ్చు.     

Vivo Y75 5G: స్పెక్స్

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 700 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 4GB ఎక్స్ టెండేడ్ RAM 2.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే, 128 GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది మరియు మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాని LED ఫ్లాష్ జతగా అందించింది. ఈ కెమెరా సెటప్ లో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మ్యాక్రో కెమెరాని అందించింది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కలిగివుంది. ఈ వివో వై75 5జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :